Condoms: 50 వేల విలువైన కండోమ్‌లను దొంగిలించిన దొంగ.. అసలు కారణం తెలిసి షాకైన పోలీసులు..
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దాదాపు యాభై వేల విలువైన కండోమ్‌లను దొంగ ఎత్తుకెళ్లాడు. అంతే కాకుండా మేకప్ వస్తువులు, వేలకొద్దీ చాక్లెట్లు, స్పిరిట్‌లను కూడా దొంగిలించాడు. చాలా రోజుల తర్వాత పోలీసులు అతడిని పట్టుకోగలిగారు. అయితే దొంగ చెప్పిన రీజన్ విని పోలీసులు షాకయ్యారు.
కొందరు దొంగలు చేసే పనులు విచిత్రంగా అనిపిస్తాయి. ఎందుకంటే కొన్నిసార్లు దొంగలు వారి వింత చేష్టల వల్ల వైరల్ అవుతారు. అంతే కాదు వారు చెప్పే కారణాలు కూడా నవ్వు తిప్పిస్తాయి. మరిందరు చెప్పేవి ఆలోచింప చేస్తాయి. కొన్నిసార్లు దొంగతనం చేసే పద్ధతులు కూడా వైరల్ అవుతాయి. ఆ మధ్య వైన్ షాపులో చోరీకి వచ్చి మద్యం సేవించి అక్కడే పడుకోవడాన్ని మనం చదవి ఉంటాం. ఏపీలోని ఓ మద్యం షాపులో చోరీ చేసి తిరిగి బయటకు వస్తూ ఓ కిటికిలో ఇరుక్కుపోయిన ఘటనను మరిచిపోక పోయి ఉంటాం. అయితే ఈ ఘటనలో దొంగ చేసిన పని మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ షాపులో చోరీ చేసిన దొంగ దాదాపు యాభై వేల విలువైన కండోమ్‌లను దొంగిలించాడు. ఈ చోరీ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అతను చెప్పిన కారణం విన్న తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. దాదాపు యాభై వేల విలువైన కండోమ్‌లను దొంగ ఎత్తుకెళ్లాడు. అంతే కాకుండా మేకప్ వస్తువులు, వేలకొద్దీ చాక్లెట్లు, స్పిరిట్‌లను కూడా దొంగిలించాడు. ఇది మాత్రమే కాదు.. దొంగ అనేక ఇతర వస్తువులను కూడా దొంగిలించాడు.
ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగింది. మీడియా కథనాల ప్రకారం, 30 ఏళ్ల వయసు కలిగిన ఈ దొంగ.. గత కొంత కాలంగా ఒకే షాపులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తేలింది. అంటే ఒకే షాపులో పన్నెండు సార్లు దొంగతనం చేశాడు. చోరీకి పాల్పడిన ప్రతీసారి యాభై వేల కండోమ్‌లను దొంగిలించడం. వాటితోపాటు మరికొన్నింటిని కూడా ఎత్తుకుపోవడం జరిగింది. దీని కారణంగానే ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒకే పెద్ద షాపులో 12 సార్లు దొంగతనం చేయడం.
యాభై వేల విలువైన కండోమ్‌లు చోరీ..
కొద్దిరోజుల క్రితం మొదట లక్షన్నర విలువైన మేకప్ వస్తువులను దొంగిలించాడు. ఆ తర్వాత సుమారు 32 వేల విలువైన కోట్లు, 18 వేల విలువైన చాక్లెట్లు చోరీ చేశాడు. చివరికి యాభై వేల విలువైన కండోమ్‌లను దొంగిలించాడు. ఆ తర్వాత నెలలో మాంసం దొంగిలించాడు. అతని వద్ద నుంచి నలభై లక్షల విలువైన వస్తువులను పోలీసులు రికవరీ చేశారు.
12 దొంగతనం కేసుల్లో..
నిందితుడైన అతడు ప్రతిసారీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. కానీ చివరికి పోలీసులు అతడిని చాకచక్యంగా అరెస్టు చేశారు. అతన్ని విచారించినప్పుడు, ఈ వారం అతను బర్మింగ్‌హామ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఒక దుకాణంలో 12 దొంగతనాల కేసుల్లో ఇదంతా దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. అతను తన ఇతర దొంగతనాలను కారణం కూడా చెప్పాడు. అదే సమయంలో అతను తండ్రి కావడం.. సరిగ్గా అప్పుడే అతని తండ్రి చనిపోవడం ఈ రెండు ఘటనలు ఒకేసారి జరగడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు వెంటాడినట్లుగ ఒప్పుకున్నాడు. అతను ఆ సమయంలో నిరాశ్రయుడు. అతను ఈ విషయాలను అంగీకరిస్తాడు. దొంగిలించిన వస్తువులన్నీ అమ్మి డబ్బు సంపాదించేందుకే దొంగతనాలు చేసేవాడని చెప్పాడు.
మరిన్ని ట్రెండిగ్ న్యూస్ కోసం