NTR District: పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసిన కానిస్టేబుల్ బైక్ కొట్టేసిన దొంగ.. కట్ చేస్తే…

ఈ దొంగ మాములోడు కాదు. పోలీస్ స్టేషన్ ముందే పోలీస్ బైకే దొంగతనం చేశాడు. దీంతో కాప్స్ వెంటనే రంగలోకి దిగి.. అతడి కోసం వేట మొదలెట్టారు.

NTR District: పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసిన కానిస్టేబుల్ బైక్ కొట్టేసిన దొంగ.. కట్ చేస్తే...
Bike Thief
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 22, 2022 | 9:09 PM

Andhra Pradesh: మనకేమైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేస్తాం. కానీ ఓ దొంగ పోలీసులకే సవాల్ చేస్తూ రెచ్చిపోయాడు. ఏకంగా పోలీస్ స్టేషన్‌ను ముందు పార్క్ చేసిన కానిస్టేబుల్ బైక్ కొట్టేశాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ జీపు ముందు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం భయం.. బెరుకు లేకుండా.. తాపీగా నడుచుకుంటూ వచ్చి బైక్  తస్కరించి పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. దీంతో ఖాకీలకు కోపం వచ్చింది. తామంటే కనీసం లెక్క లేకుండా వ్యవహరించిన దొంగకు చుక్కలు చూపించాలని డిసైడయ్యారు. వెంటనే రంగంలోకి దిగి.. అన్ని మార్గాల్లో పోలీసులను అలెర్ట్ చేశాడు. దీంతో గంటల వ్యవధిలోనే దొంగ చిక్కాడు. నిందితుడు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా పట్టుకున్నారు. అపహరించిన వ్యక్తిని కంచికచర్ల(Kanchikacherla)కు చెందిన నండ్రు మాణిక్యాలరావు (22)గా గుర్తించారు. కాగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు కూడా పోలీసులు ఇంతే ఫాస్ట్‌గా రియాక్టయితే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..