Optical Illusion: ఈ ఫోటో చాలా స్పెషల్.. మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తుంది.. అదెలాగంటే..!
సాధారణంగా మనం చూసేదే మన మెదడును నిర్ణయిస్తుంది. మన కళ్లకు కనిపించేది మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. మన ఆలోచనలు..
సాధారణంగా మనం చూసేదే మన మెదడును నిర్ణయిస్తుంది. మన కళ్లకు కనిపించేది మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. మన ఆలోచనలు.. మానసిక పరిస్థితి.. మెదడు పనితీరు ఎలా ఉంటుందనేది మనం ఏదైతో చూస్తామో అదే నిర్ణయిస్తుంది. దానినే సైకలాజికల్ అంటారు. ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోస్ .. మన స్వభావం ఎలాంటిది అనేది నిర్ణయిస్తుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని రకల ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
ఆర్టిస్ట్ ఒలేగ్ షుప్లియాక్ రూపొందించిన చిత్రానికి టుగెదర్ అనే పేరు పెట్టారు. అందులో ఓ జంట ఒకరినొకరు చూసుకుంటున్నారు. మీరు నిశితంగా పరిశీలిస్తే.. అందులోనే కొవ్వొత్తిని పట్టుకున్న మరో జంట కనిపిస్తుంది. వారిద్దరు వృద్ధులు. ఆ జంట ముఖాలు.. యువ జంట కళ్ల మాదిరిగా.. వారి శరీరాలు.. యువ జంట ముఖాలుగా కనిపిస్తుంది. ఆ వృద్ద జంట పట్టుకున్న కొవ్వొత్తి.. యువజంట ముక్కు మాదిరిగా కనిపిస్తుంది.
అయితే ఈ ఫోటోలో ముందుగా మీరు కేవలం యువ జంటను మాత్రమే చూసినట్లయితే .. మీరు జీవితంలో పెద్ద చిత్రాలను.. పైన కనిపించే పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని నిపుణులు అంటున్నారు.
అలాగే ముందుగా వృద్ద జంటను గమనిస్తే.. మీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని.. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనించి నిర్ణయం తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ఎక్కువగా శ్రద్ద చూపిస్తారు.
కొన్ని ఆప్టికల్ భ్రమలు.. అనుబంధాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరు వాటిని ఒకే విధంగా చూడలేరు. కంటికి సంబంధించిన కొన్ని పరిస్థితులు లేదా కంటిశుక్లం, గ్లాకోమా లేదా డయాబెటిక్ రెటినోపతి వంటి వ్యాధులు ఒక వ్యక్తి యొక్క కాంట్రాస్ట్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తాయి. ఇది ఒక వస్తువును దాని నేపథ్యానికి వ్యతిరేకంగా వేరు చేయగల దృశ్య వ్యవస్థ సామర్థ్యాన్ని కొలవడం జరుగుతుంది.
Also Read: Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..
RRR Movie: ఫ్యాన్స్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..
Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్