Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. సోషల్ మీడియాలో హిలేరియస్ రెస్పాండ్స్..

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుక అతి ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ తన పెళ్లి ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటారు. ఘనంగా జరిపేందుకు ఉవ్విళ్లూరుతారు. అందరినీ పిలిచి.. వైభవంగా జరుపుకునేందుకు...

Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. సోషల్ మీడియాలో హిలేరియస్ రెస్పాండ్స్..
Pakistan Wdding
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 10, 2022 | 4:57 PM

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుక అతి ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ తన పెళ్లి ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటారు. ఘనంగా జరిపేందుకు ఉవ్విళ్లూరుతారు. అందరినీ పిలిచి.. వైభవంగా జరుపుకునేందుకు ప్లాన్లు వేసుకుంటారు. అయితే పెళ్లిళ్లలో వధూవరులకు స్నేహితులు, బంధువులు గిఫ్ట్స్ ఇస్తుంటారు. వివాహ వేదికపై వరుడికి వధువు, వధువుకు వరుడు బహుమతులు ఇచ్చుకోవడం కూడా మనం చూశాం. సాధారణంగా బంగారం, వెండి, డైమంగ్ వస్తువులను గిఫ్ట్స్ గా ఇస్తుంటారు. అయితే.. పెళ్లి వేదికపై వరుడు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే మీరు షాక్ అవడం పక్కా.. సోషల్ మీడియా ప్రపంచంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. నూతన వధూవరులు చేసే చిలిపి అల్లరి పనులు, హాస్యపూరిత సన్నివేశాలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో పెళ్లి వీడియోలు తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సాధించుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధువు కోసం వరుడు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..

పాకిస్తాన్ కు చెందిన అజ్లాన్ షా ఫేమస్ యూట్యూబర్. అతనికి వరిషా అనే యువతితో వివాహం జరిగింది. అజ్లాన్ కు జంతువులంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో తన పెళ్లి సందర్భంగా భార్యకు ఒక గాడిదను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎందుకంటే ఆ యువతికి గాడిదలు అంటే చాలా ఇష్టమని, అవి ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే, ప్రేమించదగిన జంతువులనే కారణంతో వాటిని ఇచ్చినట్లు అజ్లాన్ చెప్పాడు. వివాహం తర్వాత జరిగిన రిసెప్షన్‌లో అజ్లాన్ తన భార్యకు గాడిదను బహుమతిగా ఇచ్చాడు. 30,000 రూపాయలకు గాడిదను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పోస్ట్ అయింది. వెంటనే చాలా మంది వీడియోను చూశారు. అంతే కాకుండా ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. వరీషాకు రెండు గాడిదలు దక్కాయని.. ఒకటి భర్త రూపంలో, మరొకటి బహుమతి రూపంలో అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో