Variety Wedding Card : వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. చదవాలంటే కోచింగ్ అవసరం.! వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్.
ఇటీవల వివాహాలు చేసుకుంటున్న జంటలు తమ పెళ్లిలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఒక డాక్టర్ జంట తమ వెడ్డింగ్ కార్డ్‌ను వినూత్నంగా రూపొందించారు.
నాందేడ్‌కు చెందిన డాక్టర్ సందేశ్, డాక్టర్ దివ్యల వివాహం, రిసెప్షన్ డిసెంబర్ 6, 7 తేదీల్లో జరుగనుంది. అయితే స్టాక్ మార్కెట్‌ను ఎంతో ఇష్టపడే వరుడి తల్లిదండ్రులు వెడ్డింగ్ కార్డును ఆ పదజాలంతో వినూత్నంగా రూపొందించారు. వరుడు డాక్టర్ సందేశ్‌ను మెడిసిన్ లిమిటెడ్‌గా, వధువు డాక్టర్ దివ్యను అనస్థీషియా లిమిటెడ్ అని రెండు కంపెనీలుగా పేర్కొన్నారు. ఈ జంట పెళ్లిని రెండు సంస్థల విలీనంగా అభివర్ణించారు. హిందూ సంప్రదాయ ‘రెగ్యులేటరీ నిబంధనల’కు అనుగుణంగా ఈ జంట కంపెనీల విలీనం.. అంటే పెళ్లి జరుగుతుందన్నారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ను విలువైన సందర్భ ఆహ్వానం’గా పేర్కొన్నారు. బంధు, మిత్రులను ‘రిటైల్ పెట్టుబడిదారులు’గా వ్యవహరించారు. అలాగే వివాహ వేడుకను ‘లిస్టింగ్ వేడుక’గా సూచించారు. వివాహ తేదీలను ‘బిడ్డింగ్ డేట్స్’గా పేర్కొన్నారు. అంతేగాక ఈ పెళ్లికి సంబంధించిన వివిధ ఆచారాలకు కూడా స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పేర్లు పెట్టారు. సంగీత్‌ను ‘రింగింగ్ బెల్’ అని, రిసెప్షన్‌ను ‘మధ్యంతర డివిడెండ్ చెల్లింపు’ అని, ముహుర్తాన్ని ‘లిస్టింగ్ వేడుక’ అని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి సౌకర్యాలను ‘బోనస్’ అని వ్యవహరించారు. పెళ్లి వేదిక అయిన గుల్బర్గాలోని హున్నాబాద్ రోడ్‌లో ఉన్న సకాసర్ గార్డెన్స్‌ను ‘స్టాక్ ఎక్స్ఛేంజ్’గా, వరుడి తల్లిదండ్రులను ‘ప్రమోటర్లు’గా పేర్కొన్నారు. ‘స్టాక్ మార్కెట్ ఇండియా’ అన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వినూత్న వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొందరు నెటిజన్లు కూడా స్టాక్ మార్కెట్ పదజాలంతో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..