Viral Video: దేవుడా.. జిప్ లైనింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే అడ్డుగా ఏం వచ్చిందో తెలిస్తే షాకవుతారు….
జంతువులకు సంబంధించిన ప్రతి వీడియోను చూసేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. పక్షులు.. జంతువులు.. పాములు..
జంతువులకు సంబంధించిన ప్రతి వీడియోను చూసేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. పక్షులు.. జంతువులు.. పాములు.. భయంకరమైన అనకొండలు.. ఇలా అనేక రకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి రియాలిటీ వీడియోస్ చూసేందుకు నెటిజన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొన్ని భయంకరమైన వీడియోస్ కాగా..మరికొన్ని ఆశ్చర్యంతోపాటు.. నవ్వులు పూయిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎంతో ఉత్సాహంగా జిప్ లైనింగ్ చేయాలనుకుంటున్నా ఇద్దరు యువకులకు ఎదురైన సంఘటన నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఎం జరిగింది.. ఎక్కడా జరిగింది అనే కదా మీ సందేహం.. అయితే ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందామా.
కోస్టారికాలో చిత్రీకరించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఎంతో సరదాగా జిల్ లైనింగ్ చేస్తున్నారు. ఓ వ్యక్తి ముందు సంతోషంగా వెళ్లగా.. మరో వ్యక్తి వీడియో తీస్తూ అతని వెనకాలే వెళ్తున్నాడు. సరదాగా జిప్ లైనింగ్ చేస్తున్నవారికి ఆకస్మాత్తుగా ఓచోట ఆగిపోయాడు.. వేగంగా జిప్ లైనింగ్ చేస్తూ.. అదే తాడును పట్టుకుని వెళ్తున్న (Sloth) ఎలుగును చాలా బలంగా ఢీకొట్టాడు. అతడు వచ్చిన వేగానికి ఆ ఎలుగు కిందపడిపోలేదు. నెమ్మదిగా తాడును పట్టుకుని ముందుకు వెళ్తూ వారిద్దరి వైపు చూస్తూ చేయి ఊపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
this is the craziest internet video i think i’ve ever seen pic.twitter.com/zws9aEVUeG
— ﱞdev¡n (@deadszn) March 14, 2022
Holi 2022: హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకోవాలనుకుంటే.. ఈ 4 చిట్కాలను అనుసరించండి..
Chia Seeds Benefits: చియా విత్తనాలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు….