Viral Video: కన్నీళ్లు పెట్టించే వీడియో… బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు తల్లి ప్రాణత్యాగం
ప్రపంచంలోని ప్రతి తల్లి తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. బిడ్డకు ఏదైనా ఆపద వస్తే విలవిల్లాడిపోతుంది.
ప్రపంచంలోని ప్రతి తల్లి తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. బిడ్డకు ఏదైనా ఆపద వస్తే విలవిల్లాడిపోతుంది. ఏ జీవి అయినా ఇందుకు మినహాయింపు కాదు. జంతువులు కూడా తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. తల్లి ప్రేమను తెలియజెప్పే వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి వ్యక్తి తల్లికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉంటారు. అందుకే ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, కొన్ని జింకలు చెరువును దాటేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈలోపు ఒక జింక పిల్ల అనుకోకుండా మంద నుంచి విడిపోతుంది. ఒంటరిగా ఉన్న చిన్న జింకను చూసి, మొసళ్ళు దానిని వేటాడటానికి వేగంగా కదలివస్తాయి. కానీ తల్లి తన బిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పడ్డాయని గ్రహించని.. వెంటనే అక్కడికి ఆగమేఘాలపై పరిగెత్తుకుంటూ వస్తుంది. మొసలికి తాను ఎరగా మారి.. బిడ్డకు ఒక కవచంలా నిలుస్తుంది. దీంతో జింక పిల్ల అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియోలో తరువాత ఏమి జరిగిందో చూసి అందరూ బాధపడతారు.
ముందుగా సదరు వీడియో వీక్షించండి
View this post on Instagram
వాస్తవానికి, తన బిడ్డను కాపాడటానికి, తల్లి తన ప్రాణాలను వదులుకునేందుకు సిద్దమై అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మొసలి ఆ తల్లి జింకను అమాంతం పట్టి నీటిలోకి లాక్కెల్లిపోయింది. తల్లి చనిపోయినా, బిడ్డ సురక్షితంగా బయటపడింది. వీడియోలో కనిపించే తల్లి ప్రేమ నెటిజన్లు హృదయాలను కదిలిస్తోంది. అందుకే ప్రజలు ఈ వీడియోను చాలా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను బిన్ను ధిల్లాన్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వీడియోను చూసిన తర్వాత, ఒక యూజర్ నిజంగా తల్లి ప్రేమకు ఎవరూ సాటిరారని కామెంట్ పెట్టారు. అదే సమయంలో, ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ప్రాణ త్యాగం చేయగలదు అనే మాటకు ఇదే ఒక ఉదాహరణ అని మరొక యూజర్ రాసుకొచ్చారు.
Also Read: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. వరుణ్ తేజ్ మూవీలో నటించింది.. గుర్తించారా