Viral News: ఇదెందయ్యా ఇది ఇట్టా ఉంది.. ఇలాంటి కోడి ‘గుడ్డు’ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Mar 07, 2022 | 6:35 PM

Viral News: కోడి గుడ్లలో వేరియేషన్స్ ఉంటాయని మనకు తెలిసిందే. తెల్లని గుడ్లు, బ్రౌన్ కలర్ గుడ్లు ఉంటాయి. రెండు పచ్చ సొనలు ఉన్న గుడ్లు కూడా ఉంటాయి.

Viral News: ఇదెందయ్యా ఇది ఇట్టా ఉంది.. ఇలాంటి కోడి ‘గుడ్డు’ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Egg Viral

Follow us on

Viral News: కోడి గుడ్లలో వేరియేషన్స్ ఉంటాయని మనకు తెలిసిందే. తెల్లని గుడ్లు, బ్రౌన్ కలర్ గుడ్లు ఉంటాయి. రెండు పచ్చ సొనలు ఉన్న గుడ్లు కూడా ఉంటాయి. అయితే, పరిమాణం విషయానికి వస్తే.. అన్ని గుడ్లు గుండ్రంగా కొద్దిగా పొడవుగా ఉంటాయి. కొన్ని గుడ్లు పెద్ద పరిమాణంలో ఉంటే.. మరికొన్ని గుడ్లు చిన్నగా ఉంటాయి. మొత్తానికి గుండ్రంగానే ఉంటాయి. అయితే, తాజాగా ఒక కోడి పెట్టిన గుడ్డు మాత్రం చిత్ర విచిత్రంగా ఉంది. ఆ గుడ్డును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేం కోడి రా బాబూ ఇలా పెట్టింది గుడ్డు అంటూ షాక్ అవుతున్నారు. ఈ వింత గుడ్డు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వింత కోడిగుడ్డుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రాజుపేట కాలనీలో ముంజపు సత్యనారాయణ నాటు కోళ్లను సాకుతున్నారు. అయితే, కోడిపెట్ట రోజు మాదిరిగానే ఆదివారం కూడా గూట్లోకి వచ్చి ఒక గుడ్డు పెట్టింది. అనంతరం వెళ్లిపోయింది. అయితే సత్యనారాయణ కోడి పెట్టిన గుడ్డును తీసేందుకు ప్రయత్నించగా.. వింత ఆకారంలో గుడ్డు కనిపించింది. గుండ్రంగా ఉండాల్సిన గుడ్డు వంపు తిరిగి ఉండటం చూసి షాక్ అయ్యాడు. ముందుగా అది కోడిగుడ్డ కాదని అనుకున్నారంతా.. కానీ ఆ తరువాత పరిశీలించి చూడగా గుడ్డు అని నిర్ధారించుకున్నారు. ఈ మెలితిరిగి ఉన్న గుడ్డును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ గుడ్డును చూసి షాక్ అవుతున్నారు. అయితే, జన్యుపరమైన లోపాల కారణంగానే గుడ్డు అలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వింత గుడ్డును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Egg

Egg

Also read:

Babies Cry: అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఎందుకు రావు.. దీని వెనుక ఉన్న కారణం ఇదే..!

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి మరో స్పెషల్ అప్టేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఆ నిర్ణయం..

Bheemla Nayak: భీమ్లానాయక్ ఎఫెక్ట్.. పవన్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు.. వారందిరిపైనా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu