Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: తాజ్ ఉద్యోగి చేసిన పనికి రతన్ టాటా ఫిదా..! గోల్డెన్ హార్ట్ మ్యాన్ అంటూ నెటిజన్ల పొగడ్తలు.. ఎందుకో తెలుసా?

Viral News: ముంబయి తాజ్ హోటల్ ఉద్యోగి రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. ఆ ఉద్యోగి ఫొటో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral Photo: తాజ్ ఉద్యోగి చేసిన పనికి రతన్ టాటా ఫిదా..! గోల్డెన్ హార్ట్ మ్యాన్ అంటూ నెటిజన్ల పొగడ్తలు.. ఎందుకో తెలుసా?
Trending Photo
Follow us
Venkata Chari

|

Updated on: Sep 24, 2021 | 5:13 PM

Viral Photo: ముంబయి తాజ్ హోటల్ ఉద్యోగి రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. ఆ ఉద్యోగి ఫొటో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిలో ఆ వ్యక్తి భారీ వర్షంలో తడుస్తున్నఓ కుక్కకు తన గొడుగు అందించాడు. ఈ ఉద్యోగి ఫోటోను వ్యాపార దిగ్గజం రతన్ టాటా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. రతన్ టాటా పంచుకున్న ఈ పోస్ట్‌ను 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. సోషల్ మీడియా యూజర్లు తాజ్ హోటల్ ఉద్యోగిని ‘గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి’గా అభివర్ణిస్తున్నారు.

వైరల్ అవుతోన్న ఈ ఫొటోలో తాజ్ మహల్ ప్యాలెస్ ఉద్యోగి ముంబైలోని ఒక కాఫీ షాప్ బయట నిలబడి ఉన్నాడు. అప్పుడే భారీ వర్షం మొదలైంది. దీంతో తన గొడుగును తీసి వర్షానికి తడవకుండా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అప్పుడికి సమీపంలోనే ఒక వీధి కుక్క వర్షంలో తడిసిపోవడం చూశాడు. దీంతో అతని గొడుగులో కుక్కకు ఆశ్రయం అందించాడు. ఆ కుక్క సదరు వ్యక్తి పాదాల దగ్గర హాయిగా కూర్చున్నట్లు కనిపిస్తుంది.

ఈ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, పారిశ్రామికవేత్త రతన్ టాటా ‘ఈ వర్షాకాలంలో వీధి జంతువులకు ఉపశమనం’ అనే శీర్షికను అందించారు. ఈ తాజ్ ఉద్యోగి చాలా దయ గలవాడు. భారీ వర్షాల సమయంలో ఓ కుక్కను తడిసిపోకుండా కాపాడటానికి తన గొడుగును ఒక వీధి కుక్కతో పంచుకున్నాడు. ముంబై లాంటి బిజీ నగరంలో అతను చేసిన పని ఎంతో సంతోషాన్ని అందించింది అంటూ పేర్కొన్నారు. ఇలాంటి హృదయాన్ని హత్తుకునే క్షణం కెమెరాలో బంధించారు.

పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రశంసలతో నిండిన ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియా వినియోగదారులు తాజ్ ఉద్యోగిని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. ‘ఇది మానవత్వానికి సరైన ఉదాహరణ’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ‘ఇది చాలా అందమైన చిత్రం సర్’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Viral Video: ఆ గేదె టాలెంట్‌కు సలాం కొట్టాల్సిందే .. ఈ వీడియో చూస్తే నోరెళ్లబడతారు..!