Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 186ల కోసం చూసుకున్న ఫుడ్ డెలివరీ కంపెనీ.. ఫైన్ కింద కస్టమర్ కు రూ. 5 వేలు ఫైన్ చెల్లింపు

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి స్విగ్గీ నుండి రూ. 187 విలువైన చాక్లెట్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు, అయితే స్విగ్గీ అతని ఆర్డర్‌ను డెలివరీ చేయలేదు. నివేదికల ప్రకారం లివరీ ఏజెంట్ ఐస్ క్రీం దుకాణం నుంఛి ఆర్డర్ తీసుకున్నప్పటికీ, ఐస్ క్రీమ్ వ్యక్తికి చేరుకోలేదు, అయితే Swiggy యాప్ ఆ వ్యక్తికి ఆర్డర్ డెలివరీ అయినట్లు తప్పుగా చూపింది. దీని తర్వాత ఆ వ్యక్తి Swiggy కస్టమర్ కేర్‌తో మాట్లాడాడు. అతనికి మొత్తం కథను చెప్పాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వమని కూడా అడిగాడు. అయితే Swiggy అతని డబ్బును తిరిగి ఇవ్వలేదు.

రూ. 186ల కోసం చూసుకున్న ఫుడ్ డెలివరీ కంపెనీ.. ఫైన్ కింద కస్టమర్ కు రూ. 5 వేలు ఫైన్ చెల్లింపు
Swiggy Fails To Deliver Ice Cream
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2024 | 10:48 AM

కొంతమంది దుకాణదారులు తమ షాప్ లో కొనే వస్తువులకు ప్రజల నుంచి ఎక్కువ ధర తీసుకున్న సందర్భాలు అనేకం. ముఖ్యంగా MRP ధర కంటే ఎక్కువుగా డబ్బులు తీసుకునే షాప్స్ గురించి తరచుగా వైరల్ అవుతూఉంటాయి. వాస్తవానికి MRP కంటే ఎక్కువ వసూలు చేసే దుకాణదారులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కస్టమర్స్ ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. అదే సమయంలో కొంతమంది కస్టమర్స్ వినియోగదారుల ఫోరమ్‌లో దీని గురించి నేరుగా ఫిర్యాదు చేస్తారు. ప్రస్తుతం దుకాణదారు అమ్మకానికి సంబంధించిన ఒక కేసు చర్చనీయాంశమైంది. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీకి ఒక కేసులో రూ.5,000 జరిమానా విధించింది.

అసలైన విషయం ఏమిటంటే బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి స్విగ్గీ నుండి రూ. 187 విలువైన చాక్లెట్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు, అయితే స్విగ్గీ అతని ఆర్డర్‌ను డెలివరీ చేయలేదు. నివేదికల ప్రకారం లివరీ ఏజెంట్ ఐస్ క్రీం దుకాణం నుంఛి ఆర్డర్ తీసుకున్నప్పటికీ, ఐస్ క్రీమ్ వ్యక్తికి చేరుకోలేదు, అయితే Swiggy యాప్ ఆ వ్యక్తికి ఆర్డర్ డెలివరీ అయినట్లు తప్పుగా చూపింది. దీని తర్వాత ఆ వ్యక్తి Swiggy కస్టమర్ కేర్‌తో మాట్లాడాడు. అతనికి మొత్తం కథను చెప్పాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వమని కూడా అడిగాడు. అయితే Swiggy అతని డబ్బును తిరిగి ఇవ్వలేదు.

స్విగ్గీ వాదనలను కోర్టు తోసిపుచ్చింది

ఇవి కూడా చదవండి

స్విగ్గీ వైఖరికి ఆగ్రహం చెందిన వ్యక్తి ఈ విషయాన్ని వినియోగదారుల కమిషన్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే కస్టమర్, రెస్టారెంట్ మధ్య మధ్యవర్తి మాత్రమేనని స్విగ్గీ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. అంతేకాదు తమ డెలివరీ ఏజెంట్ చేసిన తప్పుకు తాము బాధ్యత వహించలేమని అది వాదించింది. అయితే కోర్టు స్విగ్గీ వాదనలను తిరస్కరించిం, ఆర్డర్‌లను డెలివరీ చేయనప్పటికీ తిరిగి చెల్లించడంలో స్విగ్గీ విఫలమవడం దాని ‘సేవలో లోపం’, ‘అన్యాయమైన వాణిజ్య విధానాలను చూపుతుందని పేర్కొంది. ‘.

10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని..

నివేదికల ప్రకారం, ఫిర్యాదుదారు మొదట స్విగ్గీ నుండి రూ. 10,000, న్యాయపరమైన ఖర్చుల కోసం రూ. 7,500 నష్టపరిహారం డిమాండ్ చేశారు. అయితే కోర్టు పరిహారం మొత్తాన్ని అధికంగా ఉన్నట్లు ప్రకటించిం. రూ. 5,000 చెల్లించాలని స్విగ్గీని ఆదేశించింది.

మరిన్ని  ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..