AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవర్ కావాలి.. ప్రేమ కోసం వెదుకుతున్న 70 ఏళ్ల వృద్ధుడు.. ప్రకటనకు లక్షల ఖర్చు.. కండిషన్స్ అప్లై

గిల్బర్టీ తన ప్రకటన పనిచేసిందని చెప్పాడు. కేవలం రెండు వారాల్లోనే తనకు 400కు పైగా కాల్‌లు వచ్చాయి. 50 ఇమెయిల్‌లు కూడా అందాయి. అందులో అమ్మాయిలు తనను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. కనుక గిల్బెర్టి తన 'మిస్ రైట్'ని త్వరలో కనుగోనాలని ఆశిస్తున్నట్లు పలువురు కామెంట్ చేస్తున్నారు. తనకు సరైన భాగస్వామి దొరికితే.. ఆమె కోసం అమెరికాలో ఎక్కడికైనా వెళతానని చెప్పాడు. తనకు నిజమైన ప్రేమ దొరికితే బ్రిటన్‌కు కూడా వెళ్లిపోతానని చెప్పాడు.

లవర్ కావాలి.. ప్రేమ కోసం వెదుకుతున్న 70 ఏళ్ల వృద్ధుడు.. ప్రకటనకు లక్షల ఖర్చు.. కండిషన్స్ అప్లై
Al Gilberti 1Image Credit source: New York Post
Surya Kala
|

Updated on: Apr 30, 2024 | 1:05 PM

Share

ప్రేమకు వయసుతో సంబంధం లేదు ఏ వయసులోనైనా ప్రేమ కలగవచ్చు అంటారు. 70, 80 ఏళ్ల వాళ్లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూసిన, విన్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి వార్తల్లో నిలిచాడు. 70 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వృద్దు.. తన నిజమైన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు అల్ గిల్బెర్టీ. అమెరికాలోని టెక్సాస్ నివాసి. తాను ఒంటరితనంతో విసిగిపోయానని అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని .. అందుకే అమ్మాయి కోసం వెతుకుతున్నానని పేర్కొన్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అమ్మాయి కోసం లక్షలు రూపాయలు ఖర్చు చేసి మరీ ప్రకటనలు ఇస్తున్నాడు.

మిర్రర్ నివేదిక ప్రకారం గిల్బర్టీ తన ఫోటోను రోడ్డు పక్కన ఉన్న 20 అడుగుల ఎత్తైన బిల్‌బోర్డ్‌పై ఉంచారు. దానిపై ఇతను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నాడని.. కచేరీని ఆనందిస్తున్నట్లు కూడా వ్రాయబడింది. గిల్బర్టీ తన ప్రకటన పనిచేసిందని చెప్పాడు. కేవలం రెండు వారాల్లోనే తనకు 400కు పైగా కాల్‌లు వచ్చాయి. 50 ఇమెయిల్‌లు కూడా అందాయి. అందులో అమ్మాయిలు తనను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. కనుక గిల్బెర్టి తన ‘మిస్ రైట్’ని త్వరలో కనుగోనాలని ఆశిస్తున్నట్లు పలువురు కామెంట్ చేస్తున్నారు.

సరైన భాగస్వామి దొరికితే ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమే

గిల్బర్టి తన లక్షణాలను వివరిస్తూ.. తనకు వినయ విధేయతలు ఎక్కువ. నిజాయితీపరుడిని అని పేర్కొన్నాడు. తనకు సరైన భాగస్వామి దొరికితే.. ఆమె కోసం అమెరికాలో ఎక్కడికైనా వెళతానని చెప్పాడు. తనకు నిజమైన ప్రేమ దొరికితే బ్రిటన్‌కు కూడా వెళ్లిపోతానని చెప్పాడు. అయితే తాను ఇచ్చిన యాడ్ చూసిన యువతులు తాను చాలా ధనవంతుడని భావించి డబ్బు సహాయం చేయమంటూ చాలా మంది అమ్మాయిలు తనకు ఫోన్ చేశారని గిల్బర్టీ చెప్పాడు. నేను సరైన వ్యక్తిని కలవాలనుకుంటున్నాను.. అయితే తనకు నచ్చిన మనసు మెచ్చిన యువతి నుంచి ఇప్పటివరకు ఎటువంటి కాల్ రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నేను సరైన వ్యక్తిని కలిస్తే.. ఆమె కళ్ళలోకి చూసి ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలనుకుంటున్నానని రొమాంటిక్ గా చెబుతున్నాడు ఈ 70 ఏళ్ల ప్రేమికుడు.

ఇవి కూడా చదవండి

ప్రకటనల కోసం లక్షల రూపాయలు ఖర్చు

తనకు ఎటువంటి అమ్మాయి కావాలి.. ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా గిల్బర్ట్ చెప్పాడు. స్లిమ్‌గా ఉండాలని. తెలివి, విధేయత, నిజాయితీ గల భాగస్వామి కావాలని చెబుతున్నాడు. అంతేకాదు ఆమె మంచి శ్రోత అయి ఉండాలని.. ఓపెన్ మైండెడ్ నేచర్ తో పాటు తను చెప్పిన మాట వినే జీవిత భాగస్వామి కావాలని అతను చెప్పాడు. తన ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ.. తన దగ్గర రిటైర్మెంట్ తర్వాత వచ్చిన ఆదాయం ఉందని, ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, వయసుకు తగ్గట్టుగానే కనిపిస్తున్నానని చెప్పాడు. గిల్బర్టి బిల్‌బోర్డ్ ప్రకటనల కోసం వారంలో 320 పౌండ్లు అంటే దాదాపు 33 వేల రూపాయలు ఖర్చు చేస్తానని చెప్పాడు. అంటే ప్రేమికురాలి కోసం గిల్బర్ట్ ప్రకటనలకే నెలకు సుమారు రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నాడు.

మరిన్ని  ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..