Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం.. అల్లంత దూరంలో కనిపించిన ఎగిరేపళ్లెం.. వీడియో వైరల్‌!

ఆకాశంలో ఓ ఎగిరే పళ్లాన్ని గుర్తించారు యూఫాలజిస్ట్‌లు. మొన్నటి వరకు యూఎస్‌ నావికాదళ సిబ్బందికి కనిపించిన ఈ పళ్లాలు తాజాగా మెక్సికోలో..

Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం.. అల్లంత దూరంలో కనిపించిన ఎగిరేపళ్లెం.. వీడియో వైరల్‌!
Ufo
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 14, 2021 | 2:44 PM

మనిషి మేధస్సుకు సైతం దొరకని జవాబులు ఎన్నో ఉన్నాయి. భూమి మీద మనుషులు ఉన్నట్లే.. మిగిలిన గ్రహలపైనా జీవరాశి ఉండే ఉంటుందని ఎప్పటి నుంచో వాదన వినిపిస్తోంది. ఇక గ్రహాంతర వాసుల గురించి అయితే కొన్ని దశాబ్దాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఎక్కడా కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. అదిగో యూఎఫ్ఓ.. ఇదిగో యూఎఫ్.. అంటూ పలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

ఇప్పటిదాకా అమెరికా ప్రజలను పలకరించే ఎగిరే పళ్ళాలు.. తాజాగా మెక్సికో జనాలకు సైతం ‘హాయ్’ చెప్పాయి. తాజాగా మెక్సికోలో ఓ లైవ్‌ స్ట్రీమింగ్ కాన్సర్ట్‌ జరుగుతుండగా.. సమీపంలోని బిల్డింగ్స్‌ మధ్యలో నుంచి ఏదో ప్రకాశవంతంగా కనిపించింది. ఆకస్మాత్తుగా అది ఆకాశంలోకి వెళ్లిపోయింది. చూసేందుకు అదో తారాజువ్వలా కొంతదూరం మెల్లగా పైకి వెళ్లినా.. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆకాశంలోకి అదృశ్యమైందని అక్కడి జనాలు చెబుతున్నారు. అది యూఎఫ్ఓ అయివుంటుందని, యూఫాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. కానీ, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎటువైపు వెళ్లిందో మాత్రం ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్‌లో వైరల్‌ అవుతోంది. కాగా, ఈ వీడియోను ఓ వ్యక్తి యూట్యూబ్‌లో షేర్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కలలో మంటల్లో తగలబడుతున్న ఇల్లు కనిపించిందా.? అది దేనికి సంకేతమో తెలుసుకోండి.!