Viral Video: జూలు విదిల్చిన సింహం.. గొయ్యిలో దాక్కున్న అడవి పందిని.. కట్ చేస్తే.. వైరల్ వీడియో.!
అడవి నియమాలు బట్టి ప్రతీ జంతువు తమను తాము రక్షించుకునేందుకు వేరే జంతువుల కంటబడకుండా వ్యూహాలను రచించుకోవాలి. లేదంటే ఆహారం అయిపోవాల్సిందే...
అడవి నియమాలు బట్టి ప్రతీ జంతువు తమను తాము రక్షించుకునేందుకు వేరే జంతువుల కంటబడకుండా వ్యూహాలను రచించుకోవాలి. లేదంటే ఆహారం అయిపోవాల్సిందే. ఇక మృగరాజు వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎరగా ఎంచుకున్న జంతువు ఎక్కడ నక్కి ఉన్నా.. దానిపై దండయాత్రకు దిగుతుంది. తాజాగా ఓ సింహం భూమిలో నక్కిన అడవి పందిని బయటికి తీసి మరీ చంపింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆకలి మీదున్న సింహం ఎర కోసం వెతుకుతుండగా.. ఓ చెట్టు కింద భూమిలో దాక్కుంటున్న అడవి పందిని గుర్తిస్తుంది. ఇంకేముంది దానిపై ఒక్కసారిగా దాడికి దిగింది. భూమిలో దాక్కున్న దాన్ని వెంటాడి.. వేటాడింది. ఆ అడవి పందిని బయటికి తీసి మరీ తన దవడలతో గట్టిగా పట్టుకుంది. సింహం పట్టును వదిలించుకునేందుకు ఆ అడవి పందిని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. సుదీర్ఘ పోరాటంలో మృగరాజు గెలిచింది. తన ఆకలిని తీర్చుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు కామెంట్స్, లైకుల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: కలలో మంటల్లో తగలబడుతున్న ఇల్లు కనిపించిందా.? అది దేనికి సంకేతమో తెలుసుకోండి.!
View this post on Instagram