ఈ కుర్రాడి తెలివి మాములుగా లేదుగా.. రైళ్లో సీటు కోసం ఏకంగా… యువకుడు చేసిన పనికి ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్..

Viral Video:  సాధారణంగా రైళ్లు, బస్సులలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు సీటు దొరకడం చాలా కష్టం. ప్రస్తుత రద్దీ పరిస్థితులలో సీటు దొరికి..

ఈ కుర్రాడి తెలివి మాములుగా లేదుగా.. రైళ్లో సీటు కోసం ఏకంగా... యువకుడు చేసిన పనికి ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్..
Viral Video

Viral Video:  సాధారణంగా రైళ్లు, బస్సులలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు సీటు దొరకడం చాలా కష్టం. ప్రస్తుత రద్దీ పరిస్థితులలో సీటు దొరికి.. కూర్చుని ప్రయాణించడమే చాలా రిలాక్స్ గా ఫిలావుతుంటారు. ఇక ప్లేస్ దొరకడం కోసం నానా తంటాలు పండుతుంటారు. ఇక సీటు దొరకపోతే.. అక్కడే ఉన్న సపోర్ట్ వస్తువులను.. అంటే.. రోపు, పైప్ పట్టుకోని నిల్చుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం కాస్తా విచిత్రంగా ప్రవర్తించి.. సీటు దక్కించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో… ఒక యువకుడు ప్రయాణీకులతో రద్దీగా ఉన్న మెట్రో రైలు ఎక్కాడు. కానీ ఏం లాభం.. అప్పటికే ట్రైన్ మొత్తం ఒక్క సీటు కూడా లేకుండా.. ఫుల్ రద్దీగా ఉంది. ఇక తప్పక అక్కడే ఉన్న రోప్ పట్టుకొని నిల్చున్నాడు. ఇంతలో ఆకస్మాత్తుగా ఆ యువకుడు మూర్ఛా వచ్చినట్లుగా వణికిపోయాడు. దీంతో అక్కడి ప్రయాణికులు ఒక్కసారికి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడికి ఎదురుగా ఉన్న మహిళ లేచి పక్కకు పరిగెత్తింది. మరో మరో మహిళ అతని టోపి కింద పడిపోతే అది తీసి సీటు పైన పెట్టింది. ఇక ఆ తర్వాత యువకుడు ఆ సీట్లో కూర్చొని మరోసారి షాక్ కొట్టినట్లుగా వణికిపోయాడు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఆ యువకుడి తెలివికి ఆశ్చర్యపోతున్నారు. సీటు కోసం ఐడియా అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఆ ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి….

ట్వీట్..

Also Read: Sushant Singh Rajput: విమానం నడపడం, నాసా వర్క్‌షాప్, అంధులకు కోడింగ్.. వెండితెర ధోని ’50 డ్రీమ్స్’ లిస్టు ఇదే

Sushant Singh Rajput Death Anniversary: సుశాంత్ మొదటి వర్ధంతి: అద్భుత హీరో రేర్, అన్‌సీన్ ఫోటోలపై ఓ లుక్కేయండి

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu