Viral Post: శాండ్‌విచ్‌లకు స్వస్తి చెప్పండి.. ఎయిర్‌లైన్స్ కంపెనీలకు విజ్ఞప్తి..! మహిళా సీఈఓ పోస్ట్‌ వైరల్‌

ఓ సోషల్ మీడియా యూజర్ దీనిపై స్పందిస్తూ.. ఎయిర్‌లైన్స్‌లో అందించే ఏ ఆహారం ఆరోగ్యకరమైనది కాదు మేడమ్ అంటూ రాశారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. నిజంగానే మన దగ్గర చాలా వెరైటీల ఫుడ్స్‌ ఉన్నాయి.. కాబట్టి ఎయిర్‌లైన్స్ నిజంగా మెరుగైన పని చేయాలని ఒకరు రాశారు.

Viral Post: శాండ్‌విచ్‌లకు స్వస్తి చెప్పండి.. ఎయిర్‌లైన్స్ కంపెనీలకు విజ్ఞప్తి..! మహిళా సీఈఓ పోస్ట్‌ వైరల్‌
Spare Us The Sandwich
Follow us

|

Updated on: Sep 22, 2024 | 8:22 PM

విమానంలో ప్రయాణిస్తున్న వారికి కొన్ని రకాల ప్యాకింగ్‌ ఫుడ్స్‌ అందిస్తుంటారు. ఇందులో ప్రధానంగా శాండ్‌విచ్‌లు కూడా ఉంటాయి. రెండు ముక్కల బ్రెడ్ మధ్యలో కాస్త చీజ్ వేసి డెకరేట్ చేసే ఇలాంటి ఆహారం ఎంత వరకు మంచిది అని అడుగుతున్నారు. అయితే, అవన్నీ ఆరోగ్యానికి అంత మంచివి కావంటూ, ఇలాంటి ఆహార పదార్థాలకు స్వస్తి చెప్పాలంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్‌ అవుతోంది.  ఇది భారతదేశం.. ఏ పాశ్చాత్య దేశం కాదు. భారతదేశంలో చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మన దేశంలో లభించే ఆహార పదార్థా్ల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కూడా ఉన్నాయంటూ… ఎడిల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ అవుతున్న పోస్ట్‌లో రాధికా గుప్తా ఇలా రాశారు..ఇది భారతదేశం.. మనం పాశ్చాత్య దేశంలో లేము..కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో పరంధా, ఇడ్లీ, ధోక్లా, వంటి రుచికరమైన, పొదుపుగా, ఎక్కువ సమయం తాజాగా ఉండే, ప్రయోజనకరంగా ఉండే అనేక ఇతర ఆహార పదార్థాలు మన వద్ద ఉన్నాయి. ఇంకా కావాలంటే..మిగిలిపోయిన కూరగాయలతో మా తల్లులు అద్భుతమైన పరోటా రోల్స్‌ తయారు చేస్తారని, అలాంటివి రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయని అన్నారు. రాధికా గుప్తా చేసిన ఈ పోస్ట్‌ను ఐదు లక్షల మందికి పైగా చూశారు. పెద్ద సంఖ్యలో నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఓ సోషల్ మీడియా యూజర్ దీనిపై స్పందిస్తూ.. ఎయిర్‌లైన్స్‌లో అందించే ఏ ఆహారం ఆరోగ్యకరమైనది కాదు మేడమ్ అంటూ రాశారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. నిజంగానే మన దగ్గర చాలా వెరైటీల ఫుడ్స్‌ ఉన్నాయి.. కాబట్టి ఎయిర్‌లైన్స్ నిజంగా మెరుగైన పని చేయాలని ఒకరు రాశారు. పోహా ఉత్తమ అల్పాహారం, దాని పేరు మరచిపోకూడదు అని ఒకరు రాశారు. తినడానికి పరాటా ఉందని సంతోషించాలి, శాండ్‌విచ్‌ని మ్యూజియంలో ఉంచాలి అని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..