Viral Video: బ్యాగులోని యాపిల్‌ను చాకచక్యంగా కొట్టేసిన కోతి.. వానరం తెలివిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Funny Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరలవుతుంటాయి. ముఖ్యంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులతో పాటు కోతులు వంటి ..

Funny Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరలవుతుంటాయి. ముఖ్యంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులతో పాటు కోతులు వంటి మనుషులకు దగ్గరగా ఉండే జంతువుల వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా కనిపిస్తుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఇది చూసిన తర్వాత తెలివితేటల విషయంలో వానరాలను ఎందుకు మాస్టర్స్ అంటారో మరోసారి అర్థమవుతుంది. జంతువులు చాలా తెలివైనవి. ముఖ్యంగా తిండి విషయంలో తమ తెలివితేటలను చాలా చక్కగా వినియోగించుకుంటాయి. ఇక కోతుల విషయానికొస్తే.. అచ్చం మనుషుల మాదిరిగానే ఆలోచిస్తాయి. ముఖ్యంగా తినుబండారాలను దొంగలించడంలో వాటికవే సాటి. ఇటీవల అవి ఫోన్లు, కళ్లజోళ్లు ఇతర వస్తువులను లాక్కెళ్లడాన్ని కూడా మనం చూశాం. తాజాగా ఓ వ్యక్తి బ్యాగ్ నుంచి ఓ కోతి ఆపిల్ పండును చాలా చాకచక్యంగా దొంగతనం చేసి పారిపోయింది.
వైరలవుతోన్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన వీపుకు బ్యాగును తగిలించుకుని ఉన్నాడు. అందులో కొన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి. ఆ వ్యక్తేమో పార్కులో కూర్చుని పరిసరాల అందాలను ఆస్వాదించడంలో బిజీగా ఉన్నాడు. అక్కడే ఉన్న ఓ కోతి ఆ బ్యాగ్ దగ్గరికి వస్తుంది. బాఆ ఆకలిగా ఉందేమో.. బ్యాగులో తినడానికి ఏమైనా ఉన్నాయేమోనని బ్యాగ్ జిప్ ఓపెన్ చేస్తుంది. అందులో ఏమీ ఉండవు. దీంతో మరో జిప్ ను ఓపెన్ చేస్తుంది. అందులో యాపిల్స్ కనిపిస్తాయి. దీంతో కోతికి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. వెంటనే చేతిని బ్యాగు లోపలికి పెట్టి యాపిల్ పండను తీసుకుంటుంది. సైలెంటుగా అక్కడి నుంచి పారిపోతుంది. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘waowafrica’ అనే యూజర్ షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోకు1.34 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే వేలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. ‘కోతి చాలా చాకచక్యంగా దొంగతనం చేసింది’, ‘పర్యాటక ప్రదేశాల్లో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.




View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..