Viral Video: స్కూటీ డిక్కీ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూడగా ఊహించని షాక్.. వైరలవుతున్న వీడియో!
Viral Video: అదొక ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగిపోయాయి. ఇంకేముంది.. అది కాస్తా సరీసృపాల...
అదొక ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగిపోయాయి. ఇంకేముంది.. అది కాస్తా సరీసృపాలకు నిలయం అయిపోయింది. అప్పుడప్పుడూ పాములు స్కూల్ ఆవరణలోకి ప్రవేశించి అటు విద్యార్ధులను.. ఇటు ఉపాధ్యాయులను ఆందోళన గురి చేస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న పిచ్చిమొక్కల నుండి ఓ త్రాచు పాము బయటకు వచ్చింది. అక్కడ నుంచి స్కూల్ ఆవరణలోకి ప్రవేశించిన ఆ పామును చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఆ పాము అక్కడే పార్కింగ్ చేసి ఉన్న స్కూటీలోకి దూరింది.
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న స్నేక్ క్యాచర్లు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అచ్చం ఖలేజా సినిమాలో ఓ సీన్ మాదిరిగా ఆ పామును పెట్టేందుకు స్కూటీ పార్ట్స్ అన్నీ తొలగించారు. దాదాపు గంటపాటు శ్రమించి బైక్ పార్ట్స్ అన్నీ పీకేసి చివరకు పామును పట్టేశారు. ఆ తర్వాత పామును చంపడంతో స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పాము నుండి విముక్తి లభించిందని అంతా ఆనందపడగా.. బైక్ ఓనర్ మాత్రం విషాదంలో మునిగిపోయాడు.