Viral Video: నిద్రిస్తున్న మహిళల శరీరంపై పాకుతున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్

పాముకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ పాముని కొందరు బొమ్మగా భావించారు. ఒక మహిళకు సంబంధించిన వీడియోలో ఆరుబయట చాప వేసుకుని హాయిగా నిద్రపోతోంది. ఆమె శరీరంపై పాము పాకుతోంది.

Viral Video: నిద్రిస్తున్న మహిళల శరీరంపై పాకుతున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2024 | 12:11 PM

ప్రకృతిలో ఉన్న జీవుల్లో పాములు ఒకటి. వీటిని చూస్తే చాలు మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా దూరంగా పారిపోతాయి. ఎందుకంటే విష పూరితమైన పాము కాటేస్తే యమ ధర్మ రాజు వద్దకు నేరుగా చేరుకోవచ్చు. అందుకనే పాముని చూస్తే చాలు.. మనుషులే కాదు జంతువులు కూడా వీటికి దూరంగా ఉండటమే మంచిదని భావిస్తాయి. విష పూరితమైన పాము ఎవరినైనా కాటేస్తే బతకడం కష్టమవుతుంది. అయితే పాములకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో చూస్తే షాక్ తినాల్సిందే.

వీడియోలో ఒక మహిళ ఇంటి వెలుపల చాపపై గాఢంగా నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. కళ్ళ మీద ఎండ పడకుండా ఆమె తన ముఖాన్ని తన చేతితో కప్పుకుంది. హాయిగా నిద్ర పోతోంది. అయితే ఈ సమయంలో ఒక పాము వచ్చింది. దీన్ని చూసిన యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వీడియోలో కనిపించే పాము చాలా పెద్దది.. చాలా విషపూరితమైన పాములా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by India YaTra (@india.yatra)

వీడియో ప్రారంభంలో ఒక మహిళ చాప మీద నేలపై నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది, ఈ సమయంలో ఒక పాము ఆమె సమీపంలోకి వచ్చి ఆమె శరీరంపైకి ఎక్కింది. కొన్ని క్షణాల తర్వాత పాము ఆమె మీద నుంచి కింద కు దిగి.. పక్కలో పాకడం మొదలు పెట్టింది. అయితే ఆ పొడవైన పాము ఆ స్త్రీకి హాని కలిగించడానికి ప్రయత్నించడం లేదు. అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ వీడియో ఎక్కడిది అన్న విషయానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాలో india.yatra అనే ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. దీన్ని చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు తెగ షేర్ చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఒకరు ఈ వీడియో తీస్తున్న వ్యక్తి బహుశా పాము కాటు వేయాలని వేచి చూస్తున్నాడు అని కామెంట్ చేశాడు. మరొకరు ప్రజలు తమను తాము వైరల్ చేసుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదన్నారు.. మరొక వినియోగదారుడు ఆమె పాము మంత్రగత్తె అని భావిస్తున్నట్లు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!