AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Season: ఇక మ్యారేజ్ సీజన్ షురూ..! దేశంలో 48 లక్షల పెళ్లిళ్లు.. లక్షల కోట్లలో బిజినెస్..

దసరా, ధన త్రయోదశి, దీపావళి వంటి పండగల సీజన్ ముగిసింది. ఇక పెళ్ళిళ్ళ సీజన్ మొదలు కానుంది. రానున్న రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో 48 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని క్యాట్ అంచనా వేసింది. ఈ పెళ్లిళ్ల ద్వారా రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.. ఒక్క రాజధాని ఢిల్లీలోనే 4.5 లక్షల వివాహాల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Wedding Season: ఇక మ్యారేజ్ సీజన్ షురూ..! దేశంలో 48 లక్షల పెళ్లిళ్లు.. లక్షల కోట్లలో బిజినెస్..
Wedding Season
Surya Kala
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 05, 2024 | 7:53 PM

Share

దసరా, ధన త్రయోదశి, దీపావళితో భారతదేశంలో పండుగల సీజన్ ముగిసింది. ఈ పండుగ సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపారవేత్తలకు కాసుల వర్షం కురిపించింది. ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు దేశంలో రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పండుగల సీజన్ ముగిసిన తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. అంచనాల ప్రకారం ఈ పెళ్లిళ్ల సీజన్ 2 నెలల పాటు కొనసాగుతుంది. ఈ పెళ్ళిళ్ళ సీజన్ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం ఇస్తుంది.

CAT అంచనాల ప్రకారం ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో 48 లక్షల వివాహాలు జరుగనున్నాయి. ఈ పెళ్లిళ్ల ద్వారా రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. కేవలం రాజధాని ఢిల్లీలో జరిగే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్ళిళ్ళు జరగనున్నాయని.. తద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. వివాహ వేడుక కోసం దీపావళికి ముందే పెళ్లి షాపింగ్ ప్రారంభించారని ఇది ఇప్పటికీ కొనసాగుతోందని వ్యాపారస్తులు చెప్పారు.

వాటిని సద్వినియోగం చేసుకున్న వినియోగదారులు..

ప్రజలు దీపావళి రోజున వెరైటీ, డిస్కౌంట్‌లను సద్వినియోగం చేసుకున్నారు. అందుకే ప్రజలు పండుగ సీజన్ ఆఫర్‌లతో పెళ్లి కోసం షాపింగ్ చేయడం ప్రారంభించారు. 75 నగరాల్లోని వ్యాపార సంస్థలతో మాట్లాడిన తర్వాత క్యాట్ సర్వే నిర్వహించింది. గత ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో 35 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరగ్గా.. ఈ సీజన్‌లో అది పెరుగుతుందని అంచనా. ఈ సంవత్సరం నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు వివాహ వేడుకలకు అనుకూలమైన సమయాలు.

ఇవి కూడా చదవండి

2 నెలల్లో 18 శుభ ముహూర్తాలు

నవంబర్‌లో ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29 తేదీల్లో ప్రారంభమై డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14 ,15, 16 తేదీల్లో కొనసాగనుంది. ఈ 2 నెలల్లో మొత్తం 18 రోజుల పాటు వివాహ వేడుక కోసం శుభ దినాలు ఉన్నాయి. డిసెంబర్ 17 నుంచి దాదాపు నెల రోజుల పాటు పెళ్లిళ్లకు బ్రేక్ పడనుంది. వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుంది. జనవరి చివరి నుంచి మార్చి 2025 వరకు పెళ్లిళ్లకు శుభ ముహార్తలున్నాయి.

మేడ్ ఇన్ ఇండియాకు పెరిగిన డిమాండ్

CAT చీఫ్ ప్రవీణ్ ఖండేల్వాల్ సర్వే నివేదిక ప్రకారం కొనుగోలుదారులు ఈసారి తమ షాపింగ్ ట్రెండ్‌ను మార్చారు. ఇప్పుడు ప్రజలు విదేశీ వస్తువుల కంటే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీపావళి రోజున ప్రజలు భారీ షాపింగ్ చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ ఊపు లభించింది. ఇప్పుడు వ్యాపారవేత్తల చూపు పెళ్లిళ్ల సీజన్‌పై పడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..