Snail Curry: నత్తల కూర ఎప్పుడైనా తిన్నారా.. అదిరే టేస్ట్.. అంతకుమించి పోషకాలు
తొలుత పెంకులు లేకుండా కొనుగోలు చేసిన నత్తలను ఉప్పు, పసుపు పొడితో కడగాలి. తరువాత వాటి నుంచి నీసు వాసన రాకుండా ఉండటానికి మజ్జిగలో కూడా కడగవచ్చు. తరువాత, వాటిని వేడి నీటిలో ఉడకబెట్టండి. ఆ తర్వాతా ఇతర మాంసాహారం మాదిరి కాస్త మసాలా దట్టించి వండేయడమే. కాస్తంత పల్లీలు దట్టిస్తే.. నాలుకకు ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో చాలామందికి నత్తల కూర ఇప్పుడు ఎంతో ఫేవరెట్.
విజయవాడ, జులై 31: ఎప్పుడో చిన్నప్పుడు ఏ పొలం గట్టు దగ్గరో, పంట కాలువల్లోనో, చెరువుల్లోనో నత్తలను చూసే ఉంటారు. పల్లెల్లో ఉన్నవారికి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ సిటీలో చాలామంది వీటి టేస్టే కాదు.. వాటిని తినడం ద్వారా అంతే పోషకాల గురించి తెలీదు. కొంతమంది అయితే వీటిని ఇప్పటి వరకు చూసే ఉండరు. అంతెందుకు వీటి పేరు తెలియని వారు కూడా నేటి జనరేషన్‌లో ఉన్నారు. అదిరే రుచితో పాటు వీటి తినడం లభించే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇవి విరివిగా లభించే సీజన్ కూడా కావడంతో.. నత్తల ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా విజయవాడ, పెనమలూరు పరిసర ప్రాంతాల్లో కేజీ నత్తలను కనీసం 200 రూపాయలకు అమ్ముతున్నారండోయ్.
ప్రతి ఏడాది పొలాలు దుక్కు దున్ని నారుమళ్ళు వేసే సమయంలో ఈ నత్త గుల్లలు బయటపడతాయి. ఈ టైంలో పంట పొలాలు, బోదెలు, కాలువల్లో వీటిని పడతారు..పెనమలూరు చుట్టుపక్కల పంట పొలాలు ఎక్కువగా ఉండటంతో కొంతమంది వ్యక్తులు గత కొద్దీ రోజుగా విరివిగా వీటిని సేకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజు 30 నుండి 40 కిలోల నత్తలను అమ్ముతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. వాటికున్న డిమాండ్. ఒకప్పుటిలా ఇవి అన్ని ప్రాంతాలతో లభించకపోవడంతో.. డిమాండ్ బాగా పెరిగిపోయింది.
నత్తలు తింటే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఆయాసం, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు నత్తలు తింటే తగ్గుతాయని చెబుతారు. అంతేకాకుండా కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతారు. ఇవి తింటే ఐరెన్, క్యాల్షియం, ప్రోటీన్, మినరల్స్, విటమిన్ A లాంటివి కూడా శరీరానికి లభిస్తారు. మరి ఇంకెందుకు ఆలెస్యం మీరు కూడా ఇవాళే నత్తలను ఓ పట్టు పట్టండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..