TikToker: టిక్‌టాక్ ఛాలెంజ్‌లో పాల్గొని అతిగా నీళ్లు తాగేసిన యువతి.. కట్‌చేస్తే ఆస్పత్రిలో ఆ స్థితిలో..
టిక్‌టాక్ ఛాలెంజ్‌లో పాల్గొని ఆసుపత్రి పాలైంది ఓ మహిళ. ఛాలెంజ్‌లో భాగంగా పరిమితికి మించి నీళ్లు తాగడంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంది. కెనడాలోని టొరంటోలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిరందంటే.. టిక్‌టాకర్ '75 హార్డ్' అనే వైరల్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు కఠినమైన నియమాలు..
కెనడా, జులై 31: టిక్‌టాక్ ఛాలెంజ్‌లో పాల్గొని ఆసుపత్రి పాలైంది ఓ మహిళ. ఛాలెంజ్‌లో భాగంగా పరిమితికి మించి నీళ్లు తాగడంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంది. కెనడాలోని టొరంటోలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిరందంటే.. టిక్‌టాకర్ ’75 హార్డ్’ అనే వైరల్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు కఠినమైన నియమాలు పాటించవల్సి ఉంటుంది.
రోజుకు రెండుసార్లు కఠినమైన వర్కవుట్‌లు చేయాలి. కఠినమైన ఆహారనియమాలు పాటించాలి. రోజూ ఒక గ్యాలన్ నీళ్లు తాగడం. తప్పనిసరిగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. రోజుకు 10 పేజీలు చదవాలి. ఇలా చేసి తమ రోజువారీ పురోగతిని ఫొటో తీసుకోవాలి. కెనడాలోని టొరంటోకు చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే రియల్టర్ ఈ టిక్‌టాక్ ఛాలెంజ్‌లో పాల్గొంది. అతిగా నీళ్లు తగడం వల్ల వాటర్ పాయిజన్ అయింది. వికారం, బలహీనత, విరేచనలు, ఏదీ తినలేకపోవడం వంటి లక్షణాలతో చివరికి ఆసుపత్రి పాలైంది.
పరీక్షించిన డాక్టర్లు ఆమెకు తీవ్రమైన సోడియం లోపం ఉన్నట్లు నిర్ధారించారు. ఇలాంటి స్థితిలో సరైన చికిత్స అందించకుంటే ప్రాణాపాయం కలగవచ్చన్నారు. రోజుకు 4 లీటర్లు నీళ్లు తాగకుండా కేవలం అర లీటరు కంటే తక్కువ నీళ్లు తాగాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. ఇంత జరిగిన సదరు మహిళ మాత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ ’75 హార్డ్’ ఛాలెంజ్‌లో పాల్గొంటానని చెప్పడం కొసమెరుపు. కాగా ఈ టిక్‌టాక్ ఛాలెంజ్ హానికరంగా ఉందని ఇప్పటికే పలు విమర్శలొస్తున్నప్పటికీ దానిని బ్యాన్ చేయకపోవడం విశేషం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.