Tamil Nadu: వేగంగా దూసుకొస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్.. చివరికి ఊహించని పరిణామం
తమిళనాడులోని టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో ఏకంగా టోల్‌ప్లాజాపైకి దూసకెళ్లడం కలకలం రేపింది. ఆ లారీని ఆపేందుకు ఓ ఉద్యేగి ప్రయాత్నించాడు. అయినా కూడా అది అదుపుతప్పి అతడ్ని ఢీకొట్టింది. అంతేకాదు అతడ్ని కొన్నికిలోమీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లింది. ఇంతటి దారణమైన ఘటనలో ఆ ఉద్యోగి మృతి చెందాడు.
తమిళనాడులోని టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో ఏకంగా టోల్‌ప్లాజాపైకి దూసకెళ్లడం కలకలం రేపింది. ఆ లారీని ఆపేందుకు ఓ ఉద్యేగి ప్రయాత్నించాడు. అయినా కూడా అది అదుపుతప్పి అతడ్ని ఢీకొట్టింది. అంతేకాదు అతడ్ని కొన్నికిలోమీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లింది. ఇంతటి దారణమైన ఘటనలో ఆ ఉద్యోగి మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే బందికోయిల్ అనే ప్రాంతంలోని నేషనల్ హైవేపై టోల్ గేట్ ఉంది. అయితే ఓ లారీ ఆ ప్రాంతానికి రాగానే దాని బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ కంగారుపడ్డాడు. ఎలాగైనా లారీ ఆపాలని ప్రయాత్నించాడు. ఇందుకోసం ముందుగా రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును ఢీకొట్టి ఆపుదామని అనుకున్నాడు. కానీ దానికి దగ్గర్లోనే కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకవేళ చెట్టును ఢీకొడితే ఆ రెస్టారెంట్‌లో ఉన్నవారు కూడా ప్రమాదానికి గురవుతారని భావించాడు. దీంతో ఆ లారీని రోడ్డుపైనే పోనిచ్చాడు. ఆ తర్వాత చివరికి టోల్‌ప్లాజా వైపు లారీ వెళ్లింది.
కానీ అక్కడ లైన్‌లో పలు వాహనాలు కనిపించాయి. దీంతో వాటిని తప్పించి ఎదురుగా కనిపిస్తున్న టోల్‌బూత్ వైపుకు డ్రైవర్ ఆ లారీని నడిపాడు.ఆ లారీని గమనించిన సతీష్ అనే ఉద్యోగి దాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే లారీ అతడ్ని ఢీకొట్టింది. దీంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ ఆ లారీ వేగం మాత్రం తగ్గలేదు. ఎదురుగా వస్తున్న ఓ కారును కూడా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అలాగే టోల్ ప్లాజాలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగికి కూడా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ లారీ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి కేరళలకు 30 టన్నుల బియ్యం లోడ్‌తో వెళ్తోందని పోలీసులు చెప్పారు. అలాగే ఈ లారీ డ్రైవర్ గుంటూర్ చెందిన కె. బాలకృష్ణగా గుర్తించారు.