Viral: చేపల కోసం వల వేసిన జాలర్లు.. ఏం చిక్కిందో తెలిస్తే స్టన్ అవుతారు
వలకు కాస్త బరువుగా అనిపించింది. ఇంకేముంది గట్టిగానే చేపలు పట్టాయని ఆ జాలర్లు భావించారు. ఆపై ఆత్రంగా వల బయటకు తీశారు. కానీ అందులో చిక్కింది చూసి స్టన్ అయ్యారు. లోపల కనిపించింది ఏంటో.. తెలుసా.. మీరు కచ్చితంగా నివ్వెరపోతారు. అసలు ఇదెలా సాధ్యం అని మైండ్ బ్లాంక్ అయినంత పనవుతుంది. దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.
వారంతా మత్స్యకారులు.. చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఆపై సరంజామా అంతా సిద్దం చేసుకుని వలలు వేశారు. వలకు కాస్త బరువుగా అనిపించింది. ఇంకేముంది గట్టిగానే చేపలు పట్టాయని ఆ జాలర్లు భావించారు. ఆపై ఆత్రంగా వల బయటకు తీశారు. కానీ అందులో చిక్కింది చూసి స్టన్ అయ్యారు. లోపల కనిపించింది ఏంటో.. తెలుసా.. ఓట్లతో నిండి ఉన్న బ్యాలెట్ బాక్స్. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ కరాండిఘి బ్లాక్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. బజార్‌గావ్ గ్రామ పంచాయితీలోని బెలూవా చెరువులో ఈ బ్యాలెట్ బాక్స్ లభ్యమైంది. అది జులై 8న జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఈ విషయాన్ని జాలర్లు స్థానిక బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నితీష్ తమంగ్ దృష్టికి తీసుకెళ్లారు. స్వాధీనం చేసుకున్న బ్యాలెట్ బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
బెలూవాలోని చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు దిగారు. ఫిషింగ్ కోసం వలలు వేశారు. ఆ సమయంలో బ్యాలెట్ బాక్స్ ఫిషింగ్ నెట్‌లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ బ్యాలెట్ బాక్స్‌పై పింక్ స్టిక్కర్ అతికించినట్లు కనిపిస్తోంది. దానిపై KDI 25 అని ఉంది. చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు చెరువులోని పెట్టెను బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లోని పోలీసులు వెళ్లి బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అది జులై 8న జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ అని గుర్తించారు. పోలింగ్ రోజున జిల్లా పరిషత్, పంచాయతీ సమితి, గ్రామపంచాయతీ అనే మూడు స్థాయిల్లోని బ్యాలెట్ బాక్సులను కొందరు దుండగులు దొంగిలించారని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తర్వాత 10వ తేదీన ఆయా ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించారు.
కౌంటింగ్ సమయంలో తృణమూల్ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ మార్గాల్లో అక్రమాలు జరిగాయని… తుది ఫలితాలను తారుమారు చేసేందుకు ఈ బాక్సులను చెరువులో పడేసినట్లు అనుమానిస్తున్నాం’’ అని నార్త్ దినాజ్‌పూర్ బీజేపీ అధ్యక్షుడు బాసుదేబ్ సర్కార్ అన్నారు. ఈ ఆరోపణలు నిరాధారమని జిల్లా తృణమూల్ చీఫ్ కన్హయాలాల్ అగర్వాల్ అన్నారు. “బ్యాలెట్ బాక్సుల చెరువులో లభ్యమవ్వడం వెనుక పూర్తి నిజానిజాల్ని పోలీసులు, అధికారులు కనుగొంటారు. ఇందులో మా పాత్ర ఏమీ లేదు” అని ఆయన అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..