Viral Video: లైక్‌ల కోసం ఎంతకైనా దిగజారుతారా.? అమ్మాయిలు చేసిన పనికి ఫైర్ అవుతోన్న నెటిజన్లు..
నిజానికి ఈ వీడియో గతంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై చేసిన స్టంట్ వీడియో చూసిన నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు అమ్మాయి బైక్‌పై కూర్చుని రైడ్ చేస్తున్నారు. అయితే డ్రైవర్ స్థానంలో ఉన్న అమ్మాయి వెనక్కి తిరిగి కూర్చొని ఉంది. అలా ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చున్నారు. బండి మాత్రం దానంతట అదే ముందుకు వెళ్తోంది. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా.? అయితే బైక్ దూసుకెళ్తున్న సమయంలో అమ్మాయిలు చేసిన పనే.....
ఏదో ఒకటి చేయాలి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి.. ఇప్పుడు చాలా మంది ఇదే ఆలోచనతో ఉన్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార విప్లవం పెరిగిందని సంతోషించాలో, దీనివల్ల జరుగుతోన్న నష్టం చూసిన బాధపడాలా తెలియని దుస్థితి నెలకొంది. సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. లైక్‌లు, కామెంట్స్, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికి ఇద్దరు అమ్మాయిలు చేసిన పని చూస్తే ఇది నిజమనించకమానదు.
నిజానికి ఈ వీడియో గతంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై చేసిన స్టంట్ వీడియో చూసిన నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు అమ్మాయి బైక్‌పై కూర్చుని రైడ్ చేస్తున్నారు. అయితే డ్రైవర్ స్థానంలో ఉన్న అమ్మాయి వెనక్కి తిరిగి కూర్చొని ఉంది. అలా ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చున్నారు. బండి మాత్రం దానంతట అదే ముందుకు వెళ్తోంది.
View this post on Instagram
ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా.? అయితే బైక్ దూసుకెళ్తున్న సమయంలో అమ్మాయిలు చేసిన పనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు హగ్ చేసుకుంటూ, లిప్ కిస్ ఇస్తూ నానా రచ్చ చేశారు. ఈ వీడియోను మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కెమెరాలో రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్త వైరల్‌గా మారింది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు అమ్మాఇయలును తిట్టి పోస్తున్నారు. లైక్‌ల కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలనుకోవడం తప్పుకాదు, కానీ ఎలాగైనా వైరల్ అవ్వాలి అనుకోవడం మంచిది కాదని గుర్తించాలి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..