Viral Video: పెళ్లి బరాత్‌తో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వరుడు.. పెళ్లి కూతురు ఇచ్చిన షాక్‌కు స్టన్ అయ్యాడు..
బరాత్ లో డీజేలో భోజ్ పురి సాంగ్ ప్లే అవుతుండగా.. వధువు ముందు వరుడు ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నాడు. వధువును కూడా డ్యాన్స్ చేయాలని చుట్టుపక్కల
పెళ్లిలో వధూవరులు, బంధువులు, కుటుంబసభ్యులు ఎంతో సరదాగా గడుపుతుంటారు. కొత్తజంటను ఆటపట్టించడం.. సరదాగా డ్యాన్స్ చేయడం చూస్తుంటాం. ఇక ముఖ్యంగా పెళ్లి బరాత్‌లో స్నేహితులు, సన్నిహితులు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు. తమ పెళ్లి బరాత్‌లో వధూవరులు డ్యాన్స్ చేయడం కామన్. తమకు నచ్చిన పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి ఎంజాయ్ చేస్తుంటారు. కొన్నిసార్లు నూతన జంట పోటీపడి మరి డ్యాన్స్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ తన పెళ్లి బరాత్‌లో ఎంతో సరదాగా డ్యాన్స్ చేస్తున్న వరుడికి షాకిచ్చింది ఓ పెళ్లికూతురు. భోజ్ పురి పాటకు అదిరిపోయే స్టెప్పులేయడంతో అక్కడున్నవారంత ఆశ్చర్యపోయారు. సిగ్గుపడుతూ డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించిన ఆ వధువు ఆ తర్వాత స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో బరాత్ లో డీజేలో భోజ్ పురి సాంగ్ ప్లే అవుతుండగా.. వధువు ముందు వరుడు ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నాడు. వధువును కూడా డ్యాన్స్ చేయాలని చుట్టుపక్కల వారు కోరడంతో ఆమె సిగ్గుపడుతూ మెల్లిగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. మొదట కాస్త తడబడినా.. ఆ తర్వాత డ్యాన్స్ తో అదరగొట్టింది. వధువు డ్యాన్స్ చూసి వరుడి ఒక్కసారిగా షాకయ్యాడు. ఎంతో సంతోషంగా ఆమెను ఎంకరేజ్ చేస్తూ మరింత డ్యాన్స్ చేసేలా ప్రోత్సాహించగా.. చుట్టూ ఉన్నవారు అరుపులతో ఆమెను మరింత ప్రేరేపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.