మీరు మాంసాహార ప్రియులా.. చికెన్, మటన్ కంటే కొండ చిలువ మాంసం బెస్ట్ అంటున్న శాస్త్రవేత్తలు.. రీజన్ ఏమిటంటే..
మాంసాహారులకు ఆహారంగా కొండ చిలువ బెస్ట్ ఎంపిక అని.. దీని మాసం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సింపుల్ గా చెప్పాలంటే మాంసాహారం తీసుకునే వారు తమ ఆహారం గురించి సీరియస్ గా ఆలోచించాలి. గొడ్డు మాంసం, కోడి మాంసం వంటి జంతువుల కంటే కొండచిలువ మాంసం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొండ చిలువ మాంసం మనుషులకే కాదు పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుందన్నారు.
ప్రతి జీవికి ఆహారం అవసరం. మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. అయితే మనిషి మాత్రం మిగతావాటికి బిన్నం..తాము ఏమి ఆహారాన్ని తింటున్నామో వారికి తెలుసు. చాలా మంది శాఖాహారాన్ని మాత్రమే తింటారు. మరికొందరు మాంసాహారాన్ని ఇష్టపడతారు. ఏది ఏమైనప్పటికీ మంచి ఆహారం ఆరోగ్య కోణం నుంచి మాత్రమే అంచనా వేయబడదు.. ఆ ఆహారం దాని లభ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే పెరుగుతునం జనాభాకు అనుగుణంగా ఆహారపు అవసరాలను తీర్చే విధంగా శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. అలాంటి పరిశోధన ఒకటి ప్రజల్లో చర్చనీయాంశమైంది. మాంసాహారులకు ఆహారంగా కొండ చిలువ బెస్ట్ ఎంపిక అని.. దీని మాసం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సింపుల్ గా చెప్పాలంటే మాంసాహారం తీసుకునే వారు తమ ఆహారం గురించి సీరియస్ గా ఆలోచించాలి. గొడ్డు మాంసం, కోడి మాంసం వంటి జంతువుల కంటే కొండచిలువ మాంసం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొండ చిలువ మాంసం మనుషులకే కాదు పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుందన్నారు.
పరిశోధనలో ఏం బయటపడింది?
ఈ అధ్యయనం ద్వారా ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన నెత్ష్ , అతని సహచరులు గొడ్డు మాంసం, కోడి మాంసం కోసం ఆ జంతువులు వేగంగా పెరగడానికి.. ఇచ్చే ఆహరం ప్రయోజనం లేని విధంగా ఉంటుందని.. అలాంటి ఆహారాన్ని కోడి, పంది వంటి వాటికీ తినిపిస్తారని నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు కొండచిలువ పెంపకంతో పోల్చినట్లయితే ఈ పశువుల సంరక్షణకు మరింత మూలధనం కూడా అవసరం.
అదే కొండ చిలువలను పెంచుకోవడం సులభం అని.. కొండచిలువలు తమను తాము అసాధారణ పరిస్థితుల్లో ఆకలితో సజీవంగా ఉంచుకోగలవు. అందువల్ల క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొండచిలువల పెంపకాన్ని చేపట్టవచ్చు. తమ అధ్యయనం సరైనదని నిరూపించడానికి పరిశోధకులు వియత్నాం, థాయ్‌లాండ్‌లోని పొలాల్లో 12 నెలల పాటు పెంచిన రెండు జాతుల పైథాన్‌లపై అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వినియోగించే మాంసం, మాంసం ఉత్పత్తి నిష్పత్తిని కనుగొన్నారు. ఇందులో కొండచిలువ 1.2, చేపలు 1.5, పౌల్ట్రీ ఉత్పత్తులు 2.8, మాంసం 10.0 ఉన్నట్లు గుర్తించారు. ఈ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే.. ఆహారం, పర్యావరణ పరంగా కొండ చిలువ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..