Mysterious Village: వింత గ్రామం.! నిద్ర వస్తే నెలల తరబడి నిద్రపోతున్న జనం..
కజకిస్తాన్‌లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజలు ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతీ వ్యక్తి దాదాపు నెల పాటు నిద్ర లేవడట. అందుకే ఈ ఊరును స్లీపీ హోల్ అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చినా కూడా నిద్రలేవరట. నిజానికి వాళ్లు నిద్రపోవాలని అనుకోరు. కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట.
కజకిస్తాన్‌లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజలు ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతీ వ్యక్తి దాదాపు నెల పాటు నిద్ర లేవడట. అందుకే ఈ ఊరును స్లీపీ హోల్ అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చినా కూడా నిద్రలేవరట. నిజానికి వాళ్లు నిద్రపోవాలని అనుకోరు. కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట. కొన్ని సార్లు రోడ్డు మీద కూడా నిద్ర పోతారట. ఇలా ఎక్కడపడితే అక్కడే నిద్ర ముంచుకొస్తే గనుక ఏకంగా నెల రోజులు అక్కడే అలాగే పడుకుంటారట ఆ ఊరి ప్రజలు. ఈ కలాచి గ్రామంలో సుమారు 600 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 14 శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధ పడుతుండటం విచిత్రం. 2010లో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి ఎంతకీ నిద్రలేవలేదట. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో.. ఈ విషయం బయటకు పొక్కింది. అలా ఈ వ్యాధితో దాదాపు 14 శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ఇది ఏదో వ్యాధి వల్లే ఇలా జరుగుతుందని భావించారట. అయితే ఆ వ్యాధి ఏంటన్నది కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ విషయం ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. మొత్తం మీద కలాచి గ్రామంలో ఓ వింత వ్యాధి వల్ల ఇలా ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

