Delhi: మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం.! ఘటనలో మహిళ మృతి, 15 మందికి గాయాలు
ఢిల్లీలోని ఘాజీపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్ తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏళ్ల మహిళ మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు బానెట్‌పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారు డోర్‌ను విరగ్గొట్టి పక్కన పడేశారు. ట్యాక్సీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు.
ఢిల్లీలోని ఘాజీపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్ తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏళ్ల మహిళ మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు బానెట్‌పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారు డోర్‌ను విరగ్గొట్టి పక్కన పడేశారు. ట్యాక్సీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మృతురాలిని ఘజియాబాద్‌కు చెందిన సీతా దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి దవాఖానాకు తరలించారు. ట్యాక్సీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు మార్కెట్ అంతా జనంతో నిండిపోయిందని, ఆ క్రమంలో కారు ఆ మహిళను వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

