Trending Video: ఇసుకలో అద్భుత సృష్టి.. నదీ తీరంలో హాకీ శిల్పం.. చూడడానికి రెండు కళ్లూ సరిపోవు..
భారతదేశ జాతీయ క్రీడ హాకీ. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆట.. క్రమంగా ప్రాబల్యం కోల్పోయింది. క్రీడాకారులు ఎవరూ ఈ ఆటపై దృష్టి పెట్టకపోవడంతో హాకీ మరుగున పడిపోయింది. ఈ క్రమంలో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు..
భారతదేశ జాతీయ క్రీడ హాకీ. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆట.. క్రమంగా ప్రాబల్యం కోల్పోయింది. క్రీడాకారులు ఎవరూ ఈ ఆటపై దృష్టి పెట్టకపోవడంతో హాకీ మరుగున పడిపోయింది. ఈ క్రమంలో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు మెడల్ సాధించింది. దీంతో దేశం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పి, ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ చాలా రోజుల విరామం తర్వాత తన కళాప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టిక్ ను ఇసుకతో రూపొందించారు. 105 అడుగుల పొడవున్న ఈ హాకీ స్టిక్ ప్రపంచంలోనే పెద్దదిగా పట్నాయక్ ప్రకటించారు. కటక్ లోని మహానది నదీ తీరంలో ఈ హాకీ స్టిక్ ను తీర్చిదిద్దారు.
2023 పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ కు ఒడిశా ఆతిథ్యమిస్తోంది. భువనేశ్వర్ లో కళింగ స్టేడియం, అలాగే రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఈ మ్యాచ్ లకు వేదికగా నిలవనున్నాయి. జనవరి 13 నుంచి 29 వరకు పోటీలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి కటక్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సుదర్శన్ పట్నాయక్ తన సైకత కళతో చక్కని హాకీ స్టిక్ రూపొందించారు.
#WATCH | Cuttack: Sand artist Sudarshan Pattnaik creates the world’s largest Hockey stick as Odisha hosts FIH Hockey Men’s World Cup 2023.
Sudarshan Pattnaik created a 105-feet long hockey stick, using 5000 hockey balls and over five tonnes of sand for the sculpture. pic.twitter.com/1UlzFZKV7N
— ANI (@ANI) January 10, 2023
హాకీ స్టిక్ కోసం 5,000 హాకీ బాల్స్, ఐదు టన్నుల ఇసుకను ఆయన వినియోగించారు. 15 మంది విద్యార్థుల సాయంతో రెండు రోజుల్లో ఆయన దీన్ని నిర్మించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.