ఏప్రిల్ ఫూల్ ఏమో అనుకున్నాడు..తీరా చూస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు
కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు లేదా సెలబ్రెటీలు అయిపోతుంటారు. అలాంటి ఘటనే తాజాగా అమెరికాలో జరిగింది. అయోవా రాష్ట్రంలోని ఓ విశ్రాంత మెకానిక్ ఎర్ల్ లాపే (61) అనే వ్యక్తికి లాటరీ టికెట్ తగలడంతో ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయారు.
కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు లేదా సెలబ్రెటీలు అయిపోతుంటారు. అలాంటి ఘటనే తాజాగా అమెరికాలో జరిగింది. అయోవా రాష్ట్రంలోని ఓ విశ్రాంత మెకానిక్ ఎర్ల్ లాపే (61) అనే వ్యక్తికి లాటరీ టికెట్ తగలడంతో ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయారు. ఆయన కొన్న టికెట్ 40 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.328 కోట్లు బహుమతికి ఎంపికైంది. దీంతో ఎర్ల్ ఆనందానికి అవధులు లేవు. అయితే తాజాగా క్లైవ్ లోని అయోవా లాటరీ కేంద్ర కార్యాలయంలో బహుమతిని తీసుకున్న అనంతరం ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ ఫూల్స్ డే రోజున తాను లొట్టో అమెరికా టికెట్ కొన్నట్లు తెలిపారు. అయితే ఆ టికెట్‌కు బహుమతి వచ్చిందన్న విషయం తెలియగానే అది ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకుని నవ్వేశానన్నారు. కానీ నిజంగానే వచ్చినట్లు స్పష్టత రావడంతో షాక్ అయ్యారు. ఎర్ల్ లాపే బహుమతి మొత్తాన్ని ఒకేసారి తీసుకునే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో ఆయనకు 21.28 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.174 కోట్లు వచ్చాయి. అలాకాకుండా ఒకవేళ ఏడాదికి కొంతమొత్తం చొప్పున తీసుకుంటే 29 సంవత్సరాల్లో 40 మిలియన్ డాలర్లూ లభించేవి. తనకు వచ్చిన సొమ్మును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయడంతోపాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకుంటానని తెలిపారు.
Note: ప్రేక్షకుల ఆసక్తి కోసమే ఈ కథనాన్ని ప్రచూరించడం జరిగింది. లాటరీ టికెట్లతో డబ్బులు సంపాదించడాన్ని టీవీ9 ప్రోత్సహించదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..