Viral Video: భీకర యుద్ధంలోనూ చిగురించిన ప్రేమ.. సైనికుడి లవ్ ప్రపోజల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో

ఇది మా ప్రస్తుత వాస్తవికత. ప్రజలను రక్షించిన తర్వాత, ఈ సైనికుడు ప్రేమ ఒక ప్రతిపాదన చేస్తున్నాడంటూ ట్విట్టర్‌లో ఈ వీడియోను పంచుకున్నారు.

Viral Video: భీకర యుద్ధంలోనూ చిగురించిన ప్రేమ.. సైనికుడి లవ్ ప్రపోజల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో
Ukrainian Rescuer Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 04, 2022 | 11:47 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంఘర్షణల మధ్య, పౌరులలో ఆశలను కలిగించే కొన్ని వీడియోలు ఇప్పటికీ నెట్టింట్లో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఇందులో యుక్రేనియన్ సైనికుడు యుద్ధంలో సైరన్‌ల శబ్దాల మధ్య తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. దీంతో ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఉక్రేనియన్ ఎమర్జెన్సీ సైనికుడు మోకాళ్ల నిల్చుని ఆమెకు పుష్పగుచ్ఛంతో ప్రపోజ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ యువతి, భావోద్వేగంతో ఓకే చెప్పి, అతనిని గట్టిగా కౌగిలించుకుంది. ఆ తర్వాత ఆమెకు ఉంగరాన్ని కూడా తొడిగేశాడు. ఈ వీడియోలోని జంట ప్రేమకు నెటిజన్లు ఫిదా అవున్నారు.

అంటోన్ గెరాష్చెంకో ట్విట్టర్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. “ఇది మా ప్రస్తుత వాస్తవికత. ప్రజలను రక్షించిన తర్వాత, ఈ సైనికుడు ప్రేమ ఒక ప్రతిపాదన చేస్తున్నాడు. ఉక్రెయిన్‌లో యుద్ధం వల్ల ప్రతి ఒక్కరి జీవితం ప్రభావితమైందని, ప్రతిదీ పరస్పరం అనుసంధానమైందని’ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ జంట ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను మీరూ చూడండి..

ఫిబ్రవరిలో రష్యా తమ దేశంపై దాడి చేసినప్పటి నుంచి అనేక మంది ఉక్రేనియన్ జంటలు నిశ్చితార్థం చేసుకున్నారు లేదా వివాహం చేసుకున్నారు. కొనసాగుతున్న యుద్ధం కారణంగా వేలాది మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.