Red King Cobra Video: అరుదైన రెడ్‌ కింగ్ కోబ్రా హల్‌చల్‌.. ఆశ్చర్యం కలిగించే వీడియో వైరల్‌..

గతంలో ఎన్నాడు నాగుపామును ఎరుపు రంగులో చూడనందున ఎర్రటి నాగుపామును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాము నిజంగా ఎరుపు రంగులో ఉందా లేదా ఏదైనా కారణాల వల్ల దాని రంగు ఎర్రగా మారిందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి, ఆఫ్రికాలో కనిపించే రెడ్ స్పిట్టింగ్ కోబ్రాస్ మాత్రమే ఎరుపు రంగులో ఉంటాయి. వాటి శరీరం మొత్తం ఎరుపు, తల నల్లగా ఉంటుంది.

Red King Cobra Video: అరుదైన రెడ్‌ కింగ్ కోబ్రా హల్‌చల్‌.. ఆశ్చర్యం కలిగించే వీడియో వైరల్‌..
King Cobra
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2024 | 5:54 PM

ప్రపంచంలో చాలా రకాల పాములు కనిపిస్తాయి. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవి. పాముకాటుకు గురైన వ్యక్తి క్షణాల్లో చనిపోయేంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అంతేకాదు.. పాముల ప్రపంచం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ భూమ్మీద వేలాది రకాల పాములు ఉన్నాయి. కొన్ని పాములు వాటి విషంతో విభిన్నంగా ఉంటాయి. మరికొన్ని రంగుతో విభిన్నంగా ఉంటాయి. పాములకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి ప్రమాదకరమైన పాముల్లో కింగ్ కోబ్రా కూడా ఒకటి.

మీరు కింగ్ కోబ్రాను చూసి ఉంటారు. సోషల్ మీడియాలో కింగ్‌ కోబ్రాకు సంబంధించి కూడా చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఎర్ర నాగుపామును చూసారా? అవును ఎర్రటి వర్ణంతో ఉన్న కింగ్‌ కోబ్రా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

Red King Cobra

నెట్టింట వైరల్ అయిన ఈ వీడియోలో ఒక వ్యక్తి ప్రత్యేకమైన రెడ్‌ కలర్‌ కింగ్‌కోబ్రాను చేతులతో పట్టుకుని చూపిస్తున్నాడు.. అతడు దాన్ని తడిమినప్పుడు ఆ పాము పడగ విప్పి లేచి నిలబడింది. రెడ్ కలర్ పామును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కనిపించిన పామును చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “స్నేక్ రెస్క్యూ అండ్ రిలీజ్” అనే క్యాప్షన్‌తో ‘స్నేక్ ఫ్రెండ్’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by jay agrawal (@jay_k_agrawal)

గతంలో ఎన్నాడు నాగుపామును ఎరుపు రంగులో చూడనందున ఎర్రటి నాగుపామును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాము నిజంగా ఎరుపు రంగులో ఉందా లేదా ఏదైనా కారణాల వల్ల దాని రంగు ఎర్రగా మారిందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి, ఆఫ్రికాలో కనిపించే రెడ్ స్పిట్టింగ్ కోబ్రాస్ మాత్రమే ఎరుపు రంగులో ఉంటాయి. వాటి శరీరం మొత్తం ఎరుపు, తల నల్లగా ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..