AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జింకను చుట్టేసిన కొండచిలువ.. వేటాడి మింగేయాలనుకుంది.. కట్ చేస్తే.!

సరీసృపాలలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటితో పెట్టుకునేందుకు అడవికి రాజైన సింహాలు సైతం ఒకటికి...

Viral Video: జింకను చుట్టేసిన కొండచిలువ.. వేటాడి మింగేయాలనుకుంది.. కట్ చేస్తే.!
Python
Ravi Kiran
|

Updated on: Dec 01, 2021 | 10:05 PM

Share

సరీసృపాలలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటితో పెట్టుకునేందుకు అడవికి రాజైన సింహాలు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ఎందుకంటే.. కొండచిలువ ఎంతటి బలశాలి జంతువునైనా.. చుట్టేసి నమిలి మింగేస్తుంది. ఏ జంతువుకైనా సమవుజ్జీ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. అడవిలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇదందరికీ తెలిసిందే. క్రూర మృగాలు అత్యంత భయంకరంగా సాధు జంతువులను వేటాడతాయి. అయితే అప్పుడప్పుడూ వేటాడే వేటగాళ్లు కూడా నిరాశతో వెనుదిరగాల్సి వస్తుంది. సరిగ్గా దీనిని అడ్డం పట్టే విధంగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అప్పుడప్పుడూ బలహీనుడు కూడా తిరగబడవచ్చు. ఏదో సినిమాలో చెప్పినట్లు.. బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంటుంది. అదే తనపై తాను నమ్మకం ఉంచడమే. ఇక్కడ ఓ జింక తనకు ఎదురుగా కొండచిలువ రూపంలో వచ్చిన మృత్యువును ధైర్యంగా ఎదిరించి పోరాడింది. చివరికి ఏమైందో వీడియోలో చూడండి.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ కొండచిలువ.. జింక తన ఎరగా చేసుకున్నట్లు మీరు చూడవచ్చు. ఆ జింక కాలికి గాయం కావడంతో అదెక్కడికి వెళ్లలేక బాధతో మూలుగుతుంటే.. దానినే అదునుగా చేసుకుని కొండచిలువ.. ఆ జింకను తన ఎరగా చేసుకుంటుంది. దాన్ని అమాంతం చుట్టేసిన కొండచిలువ.. ఎలాగైనా నమిలి మింగేద్దాం అని అనుకుంటుంది. అయితే జింక భారీ కాయం కారణంగా అది సాధ్యమవదు. అయినా సరే ఎలాగోలా ప్రయత్నిస్తుంది. అలాగే మరోవైపు.. జింక కూడా కొండచిలువ నుంచి తప్పించుకునేందుకు తన శక్తిని కూడగట్టుకుని పోరాడుతుంది.

ఇక ఇలా కొద్దిసేపు వీరిద్దరూ పోరాడతారు. అయితే చివరికి కొండచిలువ మాత్రం తన ఓటమిని చవి చూస్తుంది.. ఏమి చెయ్యలేక జింకను వదిలేసి అక్కడ నుంచి జరజరా పాక్కుంటూ వెళ్లిపోతుంది. కాగా, ఈ వీడియోను ‘World Of Wildlife and Village’ అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేయగా.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి: వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!