Viral Video: లక్ష ఉపన్యాసాల కన్నా ఇలాంటి ఓ చిన్న వీడియో చాలు.. ఆలోచింప చేస్తున్న వైరల్‌ పోస్ట్‌..

Viral Video: ప్రస్తుతం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యల్లో గ్లోబర్‌ వార్మింగ్ (Global Warming) ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న భూతాపం కారణంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి...

Viral Video: లక్ష ఉపన్యాసాల కన్నా ఇలాంటి ఓ చిన్న వీడియో చాలు.. ఆలోచింప చేస్తున్న వైరల్‌ పోస్ట్‌..
Viral Video
Follow us

|

Updated on: Jun 28, 2022 | 12:04 PM

Viral Video: ప్రస్తుతం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యల్లో గ్లోబర్‌ వార్మింగ్ (Global Warming) ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న భూతాపం కారణంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. మంచు కొండలు కరగడంతో సముద్రాల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో అనుకోని ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఇదంతా మనిషి తన చేతులారా చేసుకుంటున్నదే అనే విషయం తెలిసిందే. ప్లాస్టిక్‌, ఇంధన వినియోగం పెరగడంతో వాయు కాలుష్యం వంటి సమస్యలు భూమికి శాపంగా మారుతున్నాయి.

దీంతో పర్యవరణ పరిపరక్షణ కోసం పెద్ద ప్రచారాలు కూడా చేస్తున్నారు. కొందరు పర్యావరణ ప్రేమికులు భూమిని ఎలా కాపాడుకోవాలన్న దానిపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే ఈ ఉపన్యాసాలు విని మారే వారు ఎంత మంది ఉంటారు అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే లక్ష మాటల్లో కూడా చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో చెబుతుంది అన్నట్లు. వీడియోలు కూడా సందేశాన్ని పంచుతాయనడానికి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియోనే సాక్ష్యంగా చెప్పొచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం వెంటనే రంగంలోకి దిగకపోతే ఏం జరుగుతుందన్న విషయాన్ని ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ఇవి కూడా చదవండి

వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని ఓ సెంటర్‌లో ఒక తల్లి తన చిన్నారిని చేయి పట్టుకొని నిలబడున్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అందులో కనిపించే తల్లి మాత్రమే విగ్రహం, పక్కన ఉన్న చిన్నారిని ఐస్‌తో తయారు చేశారు. వేడి కారణంగా ఆ చిన్నారి విగ్రహం క్రమంగా కరిగిపోయింది. కరుగుతూ, కరుగుతూ చివరికి ఆ విగ్రహం మాయపై పోయింది. అక్కడ తిరుగుతోన్న జనాలు ఆ విగ్రహాలను చూసి కింద ఉన్న ఓ చిన్న కొటేషన్‌ను చదువుతూ వెళుతున్నారు. ఇంతకీ అక్కడ రాసున్న ఆ కొటేషన్‌ ఏంటంటే.. ‘గ్లోబల్ వార్మింగ్‌ కారణంగా మన భవిష్యత్తు అంతం కానుంది’. ఈ ఒక్క చిన్న లైన్‌ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏంటో చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..