GHMC Elections: పాతబస్తీలో మహిళలను తరలిస్తున్న ఆటో సీజ్
గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోలింగ్ శాతం పెంచుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
GHMC elections:గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోలింగ్ శాతం పెంచుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పాతబస్తీ అజంపుర డివిజన్ లో ఆటోల్లో పెద్ద ఎత్తున మహిళలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆటోను సీజ్ చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌తో పాటు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బోగస్ ఓట్లు వేయడానికి మజ్లీస్ ప్రయత్నిస్తుందన ఎంబీటీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.