పిచ్చి పీక్ స్టేజ్.. రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..

ఈ రికార్డును సాధించడానికి మంచుతో నిండిన పెట్టెలో తల, మెడ తప్ప అన్ని శరీర భాగాలు నిండేలా నిలబడాలి. ఈ సమయంలో స్విమ్ స్యూట్ తప్ప మరే దుస్తులు ధరించకూడదు. అయితే మంచులో నిలబడిన సమయంలో లుకాస్జ్ దంతాలు కొట్టుకోకుండా రక్షించుకోవడానికి మౌత్‌గార్డ్‌ను ధరించాడు. మొదటలో తనకు అసౌకర్యంగా అనిపించినా తర్వాత తర్వాత అలవాటు పడినట్లు చెప్పారు. 

పిచ్చి పీక్ స్టేజ్.. రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
Guinness World Record
Follow us

|

Updated on: Apr 19, 2024 | 8:33 PM

పిచ్చి పలువిధాలు అని పెద్దలు చెప్పిన మాటను కొందరు నిజం చేస్తూ రకరకాల పనులతో ప్రపంచ రికార్డ్ ను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గుంజీలు తీయడం, వంటలు, తినడం, బస్సులు లాగడం , బరువులు ఎత్తడం, పుల్-అప్‌ల వరకు మనం ఇప్పటి వరకూ లెక్కలేనన్ని ప్రపంచ రికార్డుల గురించి వాటిని సాధించిన వ్యక్తుల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం.. అయితే తాజాగా పోలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి మంచుతో నిండిన పెట్టెలో దాదాపు నాలుగు గంటలకు పైగా కూర్చొని ప్రపంచ రికార్డు సృష్టించాడు. అవును.. మీరు విన్నది నిజమే! ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పోలాండ్‌కు చెందిన 52 ఏళ్ల లుకాస్జ్ స్జ్పునార్ (Lukasz Szpunar)మంచు బాక్స్ లో కుర్చుని 4 గం 2 నిమిషాల పాటు నిలబడిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. గతంలో నెలకొల్పిన రికార్డును 50 నిమిషాలు అధిగమించి గత రికార్డులను బద్దలుకొట్టాడు.

ఇవి కూడా చదవండి

ఈ రికార్డును సాధించడానికి మంచుతో నిండిన పెట్టెలో తల, మెడ తప్ప అన్ని శరీర భాగాలు నిండేలా నిలబడాలి. ఈ సమయంలో స్విమ్ స్యూట్ తప్ప మరే దుస్తులు ధరించకూడదు. అయితే మంచులో నిలబడిన సమయంలో లుకాస్జ్ దంతాలు కొట్టుకోకుండా రక్షించుకోవడానికి మౌత్‌గార్డ్‌ను ధరించాడు. మొదటలో తనకు అసౌకర్యంగా అనిపించినా తర్వాత తర్వాత అలవాటు పడినట్లు చెప్పారు.

అయితే ఈ రికార్డ్ నెలకొల్పే సమయంలో ఐస్ బాక్స్‌లో ఉన్న లుకాస్జ్ శరీర ఉష్ణోగ్రత, స్థితిని నిరంతరం పర్యవేక్షించారు. అతను గత రికార్డ్ ను బద్దలు కొడుతూ నాలుగు గంటల దాటిన తర్వాత భద్రతా సిబ్బంది రికార్డు ప్రయత్నానికి ఎండ్ చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..