Cat: మా పిల్లి తప్పిపోయింది… ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..? తగిన బహుమానం ఉంటుందంటూ ఊరంతా పోస్టర్లు..
ప్రకాశం జిల్లా పొదిలిలో పిల్లి మిస్సింగ్ పోస్టర్లు హల్‌చల్ చేశాయి. స్థానిక విశ్వనాధపురం కాలేజ్ రొడ్ లో గురువారం పిల్లి కోసం పొస్టర్ కలకలం సృష్టించింది. పోస్టర్ ను చూసిన స్థానిక ప్రజలు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. పిల్లి కోసం తన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. తన పెంపుడు పిల్లి ఆచూకి తెలపండి పారితోషికం పొందండి అంటూ కాళీ డ్రమ్ముకు పోస్టర్ వేశారు. ఎవరికైనా పిల్లి ఆచూకీ తెలిస్తే తన ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని కోరారు. పిల్లి పైన ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది.
తల్లీ నీవెక్కడున్నావమ్మా.. అంటూ ఓ కుటుంబం నిద్రాహారాలు మాని రోదిస్తోంది… పోస్టర్లు వేసి మరీ ఆచూకీ కోసం అభ్యర్ధిస్తోంది… తెల్లవారుజామున 3 గంటలకు బయటకు వెళ్ళిన తమ చిన్నారి సాయంత్రం 5 గంటలైనా తిరిగిరాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కళ్ళనీళ్ళపర్యంతమవుతున్నారు… ఉదయం నుంచి ఆ కుటుంబ సభ్యులు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకుండా పక్క ఇళ్ళు, వీధులు వెతుకుతున్నారు… ఇంతకీ ఎవరా ఎవరా చిన్నారి… అంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆమె చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది… ఇంతకీ ఎవరా చిన్నారి అని తీస్తే చివరకు అది పెంపుడు పిల్లికోసమని తెలిసి జనం విస్తుపోతున్నారు…
ప్రకాశంజిల్లా పొదిలి విశ్వనాధపురంలో నివసిస్తున్న ఒక ప్రైవేటు విద్యా సంస్థలో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్న మాతియో ఏడాదికాలంగా ఒక పిల్లిపిల్లను పెంచుకుంటున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి నిత్యం ఇంట్లో అందరితో చనువుగా ఉండేది… తెల్లవారుజామునే నిద్ర లేచి తమ కుటుంబాన్ని మేల్కొలుపుతూ ఉండేది. కుటుంబసభ్యుల మాటలను సైతం పసిగట్టి వారికి అనుకూలంగా నడుచుకునేది. అయితే నిన్న తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన పిల్ల మధ్యాహ్నమయినా ఇంటికి రాలేదు…
గతంలో కూడా ఇలాగే బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన దాఖలాలు ఉండటంతో సాయంత్రానికి తిరిగి వస్తుందనుకున్నారు… రాత్రయినా పల్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లిడిల్లిపోయారు… వెంటనే చుట్టుపక్కల ఇళ్ళల్లో, వీధుల్లో వెతికారు… ఎంతకీ పిల్లి కనిపించకపోవడంతో దాని ఫోటోతో కూడిన పోస్టర్లను ఊరంతా అంటించి ఆచూకీ తెలపాలని వేడుకుంటున్నారు… తమ పిల్లి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషకం కూడా ఇస్తామని ప్రకటించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…