AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

True Love Story: పని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనవంతురాలైన యువతి.. సినిమాలో కాదు .. రియల్ స్టోరీనే..

ఇంటిపనులను చేయడానికి సుఫియాన్  అనే యువకుడు నాజియా ఇంట్లో చేరాడు. నాజియా ఒంటరిగా జీవిస్తోంది. ఇక సుఫియాన్ కు కూడా ఎవరు లేరు.. దీంతో అతడు.. నాజియాకి నమ్మకంగా ఉంటూ..  ఇంటి పనులను చక్కగా పనులు చేయడం ప్రారంహించాడు

True Love Story: పని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనవంతురాలైన యువతి.. సినిమాలో కాదు .. రియల్ స్టోరీనే..
Owner Servant Love Story
Surya Kala
|

Updated on: Jul 29, 2022 | 12:44 PM

Share

Owner- Servant Love Story: ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదని అంటారు.. అంతేకాదు.. ప్రేమ ఆస్తులు, అంతస్తులు, కులం మతం జాతి బేధాలను చూడదని అనేక సినిమాల్లో చూస్తున్నాం.. కథలు వింటున్నాం కూడా.. తాజాగా సినీ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని విధంగా నిజజీవితంలో ఓ ప్రేమ పెళ్లి చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌కు చెందిన నాజియా ప్రేమ కథ పాకిస్తాన్‌లోనే కాదు సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో  నాజియా తమ ప్రేమ కథ గురించి చెప్పింది.

ఇంటిపనులను చేయడానికి సుఫియాన్  అనే యువకుడు నాజియా ఇంట్లో చేరాడు. నాజియా ఒంటరిగా జీవిస్తోంది. ఇక సుఫియాన్ కు కూడా ఎవరు లేరు.. దీంతో అతడు.. నాజియాకి నమ్మకంగా ఉంటూ..  ఇంటి పనులను చక్కగా పనులు చేయడం ప్రారంహించాడు. నాజియా మంచి పనివాడి కోసం వెడుతుంటే.. ఇతని గురించి స్నేహితుల్లో ఒకరు సుఫ్యాన్ గురించి చెప్పారు. దీంతో అతడిని పనికి పెట్టుకుంది.

నజియా తన భర్త సుఫియాన్ గురించి మాట్లాడుతూ.. తాను సుఫియాన్ గురించి వున్నదానికంటే.. మంచి మనసు అని చెప్పింది. అంతేకాదు తనకు ఇంట్లో పని చేయడం ప్రారంభించిన కొన్ని రోజులకే అతని ప్రవర్తన నచ్చడం ప్రారంభించిందని పేర్కొంది. అంతేకాదు సుఫియాన్‌కు సింప్లిసిటీ అంటే ఇష్టమని, అందరినీ గౌరవిస్తాడని నజియా చెప్పింది. నజియాకు సుఫియాన్ ప్రవర్తన నచ్చడంతో ప్రేమలో పడింది. తమ మధ్య అనుబంధం ఎప్పుడు ప్రేమగా మారిందో కూడా తనకు తెలియదని చెప్పింది.  తాను సుఫియాకు ప్రేమ గురించి చెప్పినప్పుడు అతడు ఉల్కి పడినట్లు పేర్కొన్నది.  ఆ తర్వాత సుఫియాన్ కూడా ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

తన భర్తతో సంతోషంగా ఉన్నట్లు నజియా చెప్పింది. తనను ఎంతో బాగా చూసుకుంటాడని.. ఇంటి పనులన్నీ చేస్తాడని.. ఆరోగ్యం బాగుండక పొతే.. తనను ఎంతో బాగా చూస్తాడని చెప్పింది. తమాషా ఏమిటంటే, నాజియా సుఫ్యాన్‌ని సల్మాన్‌ఖాన్‌గా పిలుస్తుంది.. సుఫియాన్ ఆమెను కత్రినా కైఫ్ అని పిలుస్తాడు.   అయితే తమ ప్రేమ, పెళ్లి కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం లేదని.. తనను ఇప్పటికీ తిడుతూనే ఉంటారని నాజియా చెప్పింది. అయితే తాను అవేమీ పట్టించుకోకుండా భర్తతో సంతోషంగా గడుపుతున్నానని నజియా చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలను చదవడానికి క్లిక్ చేయండి .