optical illusion: ఈ ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? దానిబట్టి మీరెంటో చెప్పొచ్చు..

ఇలాంటివి ఒకప్పుడే కేవలం కొందరికీ మాత్రమే తెలిసేవి. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు నెట్టింట ఎన్నో ట్రెండ్‌ అవుతున్నాయి. మీ వ్యక్తిత్వాన్ని చెప్పే ఇలాంటి ఫొటోలను పర్సనాలిటీ రివీలింగ్...

optical illusion: ఈ ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? దానిబట్టి మీరెంటో చెప్పొచ్చు..
Optical Illusion
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 05, 2024 | 3:52 PM

మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తామన్నదానిపైనే మన ఆలోచనా విధానం ఆధారపడి ఉంటుంది. దానిని దృక్కోణం అంటారు. ఒక వస్తువు, ఒక సంఘటన అందరికీ ఒకేలా కనిపించదు. అది వారి వారి మానసిక స్థితి, వారు ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనిషి ఆలోచనను అంచనా వేయడానికి మానసికవేత్తలు కొన్ని రకాల వస్తువులను చూపిస్తుంటారు. ఆ వస్తువులను చూపించి మనం చెప్పే సమాధానం ఆధారంగా మనమేంటో చెప్తారు.

ఇలాంటివి ఒకప్పుడే కేవలం కొందరికీ మాత్రమే తెలిసేవి. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు నెట్టింట ఎన్నో ట్రెండ్‌ అవుతున్నాయి. మీ వ్యక్తిత్వాన్ని చెప్పే ఇలాంటి ఫొటోలను పర్సనాలిటీ రివీలింగ్ ఫొటోలుగా చెబుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను మీరు చూసే విధానం ఆధారంగా మీరు ఎలాంటి వారో చెప్పేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

పైన ఫొటోలో రెండు రకాల మనుషులు ఉన్నారు. మీకు మొదట ఏం కనిపించింది అన్నదాన్ని బట్టి మీరేంటో తెలుసుకోవచ్చు. పైన ఫొటో చూడగానే ఒకవేళ మీకు ఒక వృద్ధుడి మొహం కనిపిస్తే మీరు ఆలోచనల్లో పరిణతి చెందిన వారని అర్థం. మీ ఆలోచనలు చాలా మెచ్యురిటీతో కూడుకున్నవని చెబుతున్నారు. మీరు ప్రపంచాన్ని చూసే విధానం అందరిలా కాకుండా భిన్నంగా ఉంటుంది. అంతేకాదు అందరు గౌరవించే స్థాయికి ఎదుగుతారు.

ఒకవేళ మీకు ఈ ఫొటో చూడగానే యువతి మొహం కనిపిస్తే.. మీరు సాఫ్ట్‌ నేచర్‌తో కూడుకున్న వ్యక్తి అని అర్థం. మీరు పెద్దయ్యాక మీలో చిన్న పిల్లల ఉత్సుకత ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. అంతేకాదు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మాత్రం మరిచిపోరు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..