Optical Illusion: నా సామి రంగ.. ఈ ఫోటోలో గుడ్లగూబ ఎక్కడుందో కనిపెట్టగలరా..?

కొన్ని సందర్భాల్లో మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. చూసేందుకు ఒకలా కనిపిస్తున్నా.. వాస్తవం మాత్రం వేరే ఉంటుంది. దీనినే భ్రమ అంటారు. ఇంగ్లీష్‌లో ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. అవును, కొన్ని కొన్నిసార్లు కొన్నింటిని చూసి మనం భ్రమపడుతుంటాం. మనం ఒకటనుకుంటే.. అక్కడ మరొకటి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పజిల్ మీ ముందుకు తీసుకొచ్చాం....

Optical Illusion: నా సామి రంగ.. ఈ ఫోటోలో గుడ్లగూబ ఎక్కడుందో కనిపెట్టగలరా..?
Find The Owl
Follow us
Ram Naramaneni

|

Updated on: May 15, 2024 | 9:11 PM

మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా..? అయితే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు కనిపించే ఉంటాయ్. ఇవి ఇప్పుడు మస్త్ ట్రెండింగ్‌లో ఉన్నాయ్.  కనికట్టు మాయాజాలం చేయడం వీటి స్పెషాలిటీ. అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు అనమాట. మన ఐ ఫోకస్ ఏ మాత్రం ఉందో తెలుసుకునేందుకు, బుర్రను కాస్త యాక్టివ్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయ్. ఈ ఫోటోలో పాము మీకు కనిపించిందా..?.. ఈ చిత్రంలో తప్పుగా ఉన్న నంబర్ ఏంటి..  ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయ్..? లాంటి పజిల్స్ అనమాట. ఇలాంటి పజిల్స్ తో కొన్ని ఈజీగా ఉన్నా.. ఇంకొన్ని సరదా తీర్చేస్తాయ్. ముఖ్యంగా ఇంత టైంలో కనిపెట్టాలి అని లిమిట్ పెడితే.. హైరానాలో చాలామంది తప్పులో కాలేస్తారు. మరి టైమ్ లిమిట్ లేకపోతే తీరిగ్గా వెతికి ఎవరైనా చెబుతున్నారు. వెంటనే పట్టేస్తా కదా తోపులు అనేది.  అలాంటి ఓ ఖతర్నారక్ పజిల్ మీ ముందుకు తెచ్చాం.

పైన ఉన్న ఫోటోను ఫోకస్ చేసి చూడండి. ఓ చెట్టును క్లోజ్‌గా ఫోటో తీశారు.. ఏముంది అనుకోకండి. అక్కడ ఓ గుడ్లగూబ కూడా ఉందండి బాబూ. ఆ చెట్టు బెరడు రంగులో అది ఇమిడిపోయింది. దాన్ని కనిపెట్టేందుకు మికిచ్చే టైం 10 సెకన్లు మాత్రమే. చాలా సులవైన పజిల్ కాబట్టే.. అందుకే అంత తక్కువ సమయం. బాగా ఫోకస్ పెట్టి చూడండి ఈజీగానే గుడ్లగూబ పట్టేయవచ్చు.

ఇస్మార్ట్ బుర్ర ఉన్న చాలామంది దాన్ని గుర్తించే ఉంటారు. దాన్ని కనుగొనలేని వారు ఉంటే డోంట్ వర్రీ. సమాధానం ఉన్న ఫోటోను మేము కింద ఇచ్చేస్తాం. ఇంకోసారి ఇలాంటి పజిల్ ఇచ్చినప్పుడు మాత్రం గందరగోళానికి గురవ్వకుండా.. నెమ్మదిగా వెతకండి.

Owl

Owl

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..