Optical illusion: మీ ఐ పవర్‌ సూపర్‌ అనే ఫీలింగ్‌లో ఉన్నారా.? ఇందులో భిన్నంగా ఉన్న వర్డ్‌ని కనిపెట్టండి చూద్దాం

ప్రత్యేకంగా ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలను పోస్ట్ చేయడానికి కొందరు పేజీలను సైతం క్రియేట్ చేస్తున్నారు. ఈ పేజీలకు పెద్ద సంఖ్యలో లైక్స్‌ కూడా వస్తున్నాయి. మారిన కాలానికి అనుగుణంగా ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటోలు కూడా స్మార్ట్‌గా మారాయి. చూసే కళ్లను సైతం భ్రమ కలిగించేలా ఉండే ఉండే ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటోలకు ప్రస్తుతం ఫుల్‌ డిమాండ్‌ ఉంది...

Optical illusion: మీ ఐ పవర్‌ సూపర్‌ అనే ఫీలింగ్‌లో ఉన్నారా.? ఇందులో భిన్నంగా ఉన్న వర్డ్‌ని కనిపెట్టండి చూద్దాం
Optical Illusion
Follow us

|

Updated on: Jun 30, 2024 | 4:18 PM

రెండు ఫొటోల మధ్య ఉన్న తేడాలను కనిపెట్టడం, ఒక ఫొటోలో ఉన్న మిస్టేక్స్‌ను గుర్తించడం. సాధారణంగా ఇలాంటి పజిల్స్‌ను ఎక్కువగా న్యూస్‌ పేపర్స్‌లో చూసే వాళ్లం. అయితే ఎప్పుడైతే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి ఇలాంటి పజిల్స్‌ నెట్టింట కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫొటోలను ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు అనే పేరుతో పోస్ట్ చేస్తున్నారు.

ప్రత్యేకంగా ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలను పోస్ట్ చేయడానికి కొందరు పేజీలను సైతం క్రియేట్ చేస్తున్నారు. ఈ పేజీలకు పెద్ద సంఖ్యలో లైక్స్‌ కూడా వస్తున్నాయి. మారిన కాలానికి అనుగుణంగా ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటోలు కూడా స్మార్ట్‌గా మారాయి. చూసే కళ్లను సైతం భ్రమ కలిగించేలా ఉండే ఉండే ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటోలకు ప్రస్తుతం ఫుల్‌ డిమాండ్‌ ఉంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది.

Optical Illusion

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది ‘CAKE’ అనే ఇంగ్లిష్‌ పదం అని అంటారా.? అయితే అందులో దీనికి భిన్నంగా ఉన్న ఒక పదం ఉంది. దానిని గుర్తించడంమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటో ముఖ్య ఉద్దేశం. ఇంతకీ భిన్నంగా ఉన్న ఆ పదం ఏంటనేగా మీ సందేహం.? ‘CAKE’ అనే పదానికి బదులుగా ఇందులో ‘LAKE’ అనే ఇంగ్లిష్‌ పదం ఉంది. ఆ పదాన్ని పది సెకండ్స్‌లో గుర్తిస్తే మీ ఐ పవర్‌ సూపర్‌ ఉందని అర్థం.

ఇంతకీ మీరు ఈ పజిల్‌ను సాల్వ్‌ చేశారా.? ఒకవేళ మీరు నిజంగానే పది సెకండ్స్‌లో సాల్వ్‌ చేస్తే మీ కంటికి ఫుల్‌ పవర్‌ ఉన్నట్లు అర్థం. అయితే చూడ్డానికి ఒకేలా కనిపించే ఈ రెండు పదాల మధ్య తేడాను గుర్తించడం అంత సులభమైన విషయం కాదు. ఒకవేళ ఎంత ట్రై చేసినా మీకు సమాధానం కనిపించకపోతే ఓసారి ఫొటో రైట్‌ సైడ్‌ చివరి నుంచి మూడో లైన్‌ను గమనిస్తే సమాధానం తెలిసిపోతుంది.

Optical Illusion.jpgs

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..