Viral: దేవుడే ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపించమన్నాడట.. ఒకట్రెండు కాదు.. ఏకంగా.!
సాధారణంగా మన దగ్గర అనుకున్నదానికంటే.. డబ్బులు ఎక్కువగా ఉంటే.. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. సేవింగ్స్ అకౌంట్‌పై బ్యాంక్ వడ్డీ ఇస్తుందో కాబట్టి.. చాలామంది ఇదే పని చేస్తారు. సరిగ్గా ఇదే కోవలో ఓ మహిళ కూడా తన దగ్గరున్న డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేసింది. ఇంతకీ ఆ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా.?

సాధారణంగా మన దగ్గర అనుకున్నదానికంటే.. డబ్బులు ఎక్కువగా ఉంటే.. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. సేవింగ్స్ అకౌంట్‌పై బ్యాంక్ వడ్డీ ఇస్తుందో కాబట్టి.. చాలామంది ఇదే పని చేస్తారు. సరిగ్గా ఇదే కోవలో ఓ మహిళ కూడా తన దగ్గరున్న డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేసింది. ఇంతకీ ఆ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా.? స్వర్గంలోనండీ..! ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. మీరు వింటున్నది నిజమే.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్‌లోని లియోన్ ప్రాంతానికి చెందిన ఎస్పెరాన్జా అనే వృద్దురాలు నివసిస్తోంది. ఆమెకు ఓ రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. స్వర్గంలోని ‘చర్చి ఆఫ్ హెవెన్’ అనే బ్యాంక్‌లో నువ్వు డబ్బులు డిపాజిట్ చేస్తే.. నీకు రెండింతల లాభం వస్తుందని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఇక ఈ ఫోన్ కాల్‌ను ఆ వృద్దురాలు సీరియస్‌గా తీసుకుంది. దేవుడే ఆమెకు ఫోన్ చేసి.. డబ్బులు పంపించమన్నాడని గట్టిగా నమ్మింది. అనుకున్నదే తడువుగా ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా సుమారు 6 ఏళ్ల పాటు తన దగ్గరున్న డబ్బును ఆ బ్యాంక్‌లో డిపాజిట్ చేసింది. తన సొమ్మంతా స్వర్గానికి చేరుకుంటోందని భావించింది.
అంతటితో ఆగలేదు.. తన దగ్గర డబ్బులు లేకపోయినా.. లోన్ తీసుకుని మరీ పంపించింది. ఇలా సుమారు రూ. 2.76 కోట్లు ఆ ‘చర్చి ఆఫ్ హెవెన్’ బ్యాంక్‌లో జమ చేస్తూ వచ్చింది. కట్ చేస్తే.. ఆమె అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోవడంతో.. పిల్లలకు తల్లిపై అనుమానమొచ్చింది. ఏం జరిగిందోనని తల్లిని విచారించగా.. అసలు విషయం బయటపడింది. కాగా, తల్లి ఇంటికి దగ్గరలో నివాసముంటున్న ఓ వ్యక్తి.. ఈ తతంగం మొత్తాన్ని నడిపించాడని తెలుసుకుంటారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారి కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని జైలులో ఊసలు లెక్కపెట్టించారు.
