Kim Jong Un: కాలకేయులను మించిపోయిన కిమ్.. ఆ వీడియోలు దొంగచాటుగా చూశారని ఏడుగురికి ఉరిశిక్ష!
ఉత్తర కొరియా ప్రజలు నియంత కిమ్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు. అతడు తీసుకునే నిర్ణయాలు, విధించే శిక్షలు ప్రజలను...
ఉత్తర కొరియా ప్రజలు నియంత కిమ్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు. అతడు తీసుకునే నిర్ణయాలు, విధించే శిక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తునట్లు గతంలో మానవ హక్కుల సంఘాలు ప్రపంచానికి తెలిపాయి. ఇక తాజాగా కిమ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియాకు శత్రుదేశమైన దక్షిణ కొరియా వీడియోలను దొంగచాటుగా చూసినందుకు గత మూడేళ్ళలో ఏడుగురికి అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉరిశిక్ష విధించాడని సియోల్‌కు చెందిన ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ అనే మానవ హక్కుల సంస్థ తన నివేదికలో తెలిపింది.
కేవలం కొన్ని దక్షిణ కొరియా వీడియోలు చూసినందుకు గత మూడేళ్లలో ఏడుగురు అమాయకులకు ఉరిశిక్ష విధించాడని ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ అనే మానవ హక్కుల సంస్థ తన నివేదికలో తెలిపింది. ఆ ఏడుగురు కేవలం దక్షిణ కొరియా సినిమాలు, మ్యూజిక్ వీడియాలను చూసి వాటిని సీడీలు, యుఎస్‌బీలలో కాపీ చేసి అక్రమంగా విక్రయించినందుకు వారిని ఉరి తీసి చంపారు. శత్రుదేశమైన దక్షిణ కొరియా పట్ల తమ దేశ వాసులెవ్వరికీ సానుభూతి ఉండకూడదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గతంలో పలుమార్లు తన ప్రసంగాలలో చెప్పారు. దక్షిణ కొరియా నుంచి వలస వచ్చి ఉత్తర కొరియాలో నివాసముంటున్న వారిని అన్యాయంగా కిమ్ జోంగ్ ఉన్ హింసిస్తున్నాడని ఆ మానవ హక్కుల సంస్థ చెప్పింది.
ఇది చదవండి:
Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. ఈజీగా గుర్తించొచ్చు.. ట్రై చేయండి!
ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!
తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!
స్టోర్ రూమ్ నుంచి వింత శబ్దాలు.. భయంతో వెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.. ఎదురుగా.!