మారుతున్న లైఫ్ స్టైల్ కి అనుగుణంగా కొత్త కొత్త ఉపాధి మార్గాలు లభిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పెట్ లవర్స్ పెరిగిపోతున్నారు. కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్ గా మారింది. కేవలం పెంపకం వరకే కాదు మనుషులకంటే ఎక్కువ ఖర్చు పెట్టి వాటిని పోషిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయి వచ్చిన డాగ్ బ్రీడ్స్ కూడా మార్కెట్లో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.
అయితే ఈ ఫారేన్ బ్రీడ్స్ పెంచుకోవడం ఖరీదైన అంశం. వీటినే కొంతమంది తమ ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. మామూలు హెయిర్ కటింగ్ సెలూన్ లో పనిచేసే బార్బర్లు మెల్లిగా ఇప్పుడు డాగ్ హెయిర్ డ్రెస్సెస్ గా మారుతున్నారు. మనుషులకు కటింగ్ చేస్తే కేవలం 300 నుంచి 500 వరకు లభిస్తాయి. అది ఒక కుక్కకి హెయిర్ కట్ చేస్తే 2000 మినిమం వస్తుండడంతో ఆ ప్రొఫెషన్ వైపు అడుగు పెడుతున్నారు.
చిన్నపాటి ట్రైనింగ్ తోనే బార్బర్ లు డాగ్ హెయిర్ డ్రెస్సర్ మారే అవకాశం ఉంది. దీనికి తోడు హైదరాబాదు లాంటి నగరంలో ప్రతి గల్లీకి ఒక పెట్ క్లినిక్, పెట్ గ్రోమింగ్ సెంటర్ కనిపిస్తున్నాయి.
అవసరమైతే ఇంటికే వచ్చి డాగ్ బాత్, హెయిర్ డ్రెస్సింగ్ లాంటి డోర్ స్టెప్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి.
తమ పెంపుడు కుక్కలకు రకరకాల హెయిర్ స్టైల్స్ చేయిస్తున్నారు కస్టమర్స్. ఒక్కో హెయిర్ స్టైల్ కి ఒక్కోరకంగా చార్జ్ చేస్తూ డాగ్ హెయిర్ డ్రెస్సెస్ కూడా నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నారు. వీటికి తోడు కుక్కలకు నెయిల్స్ కటింగ్, మసాజ్, షాంపూ క్లీనింగ్ లాంటి సర్వీసెస్ అందిస్తూ ఇంకింత అదనంగా సంపాదిస్తున్నారు.
గతంలో హైదరాబాదులో డాగ్ హెయిర్ కటింగ్ చేసే స్పెషలిస్టులు లిమిటెడ్ గా ఉండేవాళ్ళు…
ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ ప్రొఫెషన్ కి డిమాండ్ రావడంతో.. యువకులు ముంబైలో ఉన్న డాగ్ హెయిర్ డ్రెస్సింగ్ ట్రైనింగ్ సెంటర్లలో క్యూ కడుతున్నారు. భవిష్యత్తులోనూ దీనికి ఇంకా డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..