Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పట్టపగలే రెచ్చిపోయిన మహిళ దొంగ.. ఏకంగా 28 కిలోల వెండితో పరార్..షాకింగ్‌ వీడియో

అక్కడకు కాస్త దూరంగా అప్పటికే మరో వ్యక్తి బైక్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆమెను బైక్‌ ఎక్కించుకుని ఇద్దరూ కలిసి ఊడాయించారు. అక్కడే ఉన్న స్థానికులు వారిని వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే వారిద్దరూ తప్పించుకున్నారు. చోరీకి గురైన 28 కిలోల వెండి విలువ రూ.23.5లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.

Watch: పట్టపగలే రెచ్చిపోయిన మహిళ దొంగ.. ఏకంగా 28 కిలోల వెండితో పరార్..షాకింగ్‌ వీడియో
Woman Steals 28 Kg Of Silver
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2024 | 3:05 PM

గుజరాత్‌లో పట్టపగలే దొంగతనం జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పట్టపగలు దోపిడీకి పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌లో 28 కిలోల వెండి తీసుకుని షాప్‌లోంచి అప్పుడే బయటకు వచ్చాడు. ఇక బయల్దేరేందుకు బైక్ మీద కూర్చొని ఉన్నాడు. ఇది గమనించిన ఓ మహిళ ముఖం కనిపించకుండా మాస్క్‌ కట్టుకుని వచ్చింది..చాకచక్యంగా ఆ వెండి ఉన్న బ్యాగ్‌ తీసుకుని అక్కడ్నుంచి పరారయ్యింది. అక్కడకు కాస్త దూరంగా అప్పటికే మరో వ్యక్తి బైక్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆమెను బైక్‌ ఎక్కించుకుని ఇద్దరూ కలిసి ఊడాయించారు. అక్కడే ఉన్న స్థానికులు వారిని వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే వారిద్దరూ తప్పించుకున్నారు. చోరీకి గురైన 28 కిలోల వెండి విలువ రూ.23.5లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో బాధితుడు బోరుమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..