Black Pepper : నల్ల మిరియాలతో ఈ సమస్యలన్నీ దూరం.. ప్రయోజనాలెన్నో..!

సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాలు ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. నల్ల మిరియాలు ఆహారానికి మంచి రుచిని అందిస్తాయి. దాంతో పాటే ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని ఆయుర్వేదంలో విరివిగా వినియోగిస్తుంటారు. తరచూ నల్లమిరియాలను వాడటం వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Oct 11, 2024 | 3:20 PM

ఆయుర్వేదం ప్రకారం నల్ల మిరియాలు జలుబు, దగ్గు, ఉబ్బసం లేదా జీర్ణ శక్తి లేకపోవడం వంటి వాటిలో ఔషధంగా ఉపయోగిస్తారు.. ఇది కాలేయం పనితీరును వేగవంతం చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

1 / 6
మారుతున్న వాతావరణం కారణంగా ఎక్కువ మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం.

2 / 6
మిరియాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. షుగర్‌తో బాధపడేవారికి సైతం మిరియాలు బెస్ట్‌ ఎంపిక. 
ఇవి జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడుతాయి.

మిరియాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. షుగర్‌తో బాధపడేవారికి సైతం మిరియాలు బెస్ట్‌ ఎంపిక. ఇవి జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడుతాయి.

3 / 6
నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ప్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగుతాయి. నల్ల మిరియాల్లోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి.

4 / 6
ఇలాంటి సీజనల్ వ్యాధులకు నల్ల మిరియాలు ఔషధంగా పనిచేస్తుంది. నల్ల మిరియాలలో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

5 / 6
నల్ల మిరియాలను వివిధ రూపాల్లో తీసుకుంటే బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు నల్ల మిరియాలు తీసుకుంటే మంచిది. మిరియాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపు, దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. మిరియాలు తింటే ఆస్తమా, వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

6 / 6
Follow us