AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illegal affair: హోటల్లోని నౌకర్‏తో యాజమాని భార్య జంప్.. వెళ్తూ వెళ్తూ భర్తకు పెద్ధ ఝలక్‌!

ఈ కేసులో అదృశ్యమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే,పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగాడు.

Illegal affair: హోటల్లోని నౌకర్‏తో యాజమాని భార్య జంప్.. వెళ్తూ వెళ్తూ భర్తకు పెద్ధ ఝలక్‌!
Illegal Affair
Jyothi Gadda
|

Updated on: Jul 30, 2022 | 8:31 PM

Share

Illegal affair:  ప్రస్తుత కాలంలో చాలా మంది వివాహా బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. పరాయి మోజల్లో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు అనేకం వార్తల్లోకెక్కుతున్నాయి. తాళి కట్టి పెళ్లి చేసుకున్న భర్త, బంగారం లాంటి పిల్లలున్న ఓ మహిళ వారివద్ద పనిచేస్తున్న మరో వ్యక్తితో పరిచయం పెట్టుకుంది. అతని కోసం భర్తను వదిలేసి.. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు మూటగట్టుకుని ఊడాయించింది. దాంతో షాక్‌ తిన్న ఆమె భర్త న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నేపాల్ నుంచి వచ్చి ఆజంగఢ్ జిల్లాలో రెండు హోటళ్లు నడుపుతున్న యువకుడి భార్య మనసు ఆ హోటల్‌లో పనిచేస్తున్న పనిమనిషిపై పడింది. ఆ తరువాత, ఆ మహిళ తన భర్తను మోసం చేయడమే కాకుండా, పిల్లలను వదిలిపెట్టి ప్రేమికుడితో కలిసి పారిపోయింది. వెళ్లే సమయంలో లక్ష రూపాయల నగదు, ఇంట్లో ఉన్న బంగారు నగలు కూడా తీసుకెళ్లినట్లు ఆమె భర్త ఆరోపించాడు. బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ఆందోళనకు దిగాడు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

నేపాల్ దేశం పర్వత బాగలామ్ మలజ్ నివాసి సాగర్ పుత్ర హరి. అతని హోటల్‌లో పని చేస్తున్న అర్మాన్ సాగర్ అనే వ్యక్తి తన భార్య పూజతో ప్రేమలో పడినట్టు పోలీసులకు వివరించాడు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఇద్దరూ అవకాశం చూసి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గురువారం రాత్రి ఇద్దరూ అవకాశం చూసి పారిపోయారు. ఆ మర్నాడు ఇంట్లో భార్య కనిపించకపోవడం, అర్మాన్ కూడా పనికి రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఎంత వెతికినా ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య పనిమనిషితో పారిపోయిందని, వెళ్లే సమయంలో లక్ష రూపాయల నగదు, 5 సవర్ల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లినట్టు సాగర్ ఆరోపించాడు. ఈ కేసులో అదృశ్యమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే,పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి