AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొడుకు మాజీ లవర్‌కు గుణపాఠం చెప్పిన తల్లి.. రింగ్‌లో ఓ రేంజ్‌లో విరుచుకు పడిందిగా

తన బిడ్డ సమస్యకు మరొకరు కారణమైతే.. తల్లి ఆ సమస్యను ఎటువంటి పరిస్థితి ఎదురైనా పరిష్కరిస్తుంది. తన బిడ్డ క్షేమం కోసం పోరాడే సమయంలో తన కంటే గొప్ప యోధురాలు ఈ ప్రపంచంలో లేరంటూ ఓ తల్లి చాటి చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Viral Video: కొడుకు మాజీ లవర్‌కు గుణపాఠం చెప్పిన తల్లి.. రింగ్‌లో ఓ రేంజ్‌లో విరుచుకు పడిందిగా
Mma Fighting
Surya Kala
|

Updated on: Oct 30, 2023 | 10:10 PM

Share

ప్రపంచంలో తల్లి ప్రేమను వర్ణించడానికి ఏ పదం కూడా సరిపోదు. ఈ ప్రపంచంలో తన బిడ్డ కోసం ఎవరితోనైనా.. ఎంతవరకైనా ప్రాణాలకు తెగించి పోరాడటానికి సిద్ధంగా ఉండేది తల్లి ఒక్కరే. నిజమైన ప్రేమకు అర్ధం తల్లి మాత్రమే.. తాను జీవించి ఉన్నంత వరకూ తన బిడ్డలకు హాని కలిగకూడదని కోరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో తన బిడ్డ సమస్యకు మరొకరు కారణమైతే.. తల్లి ఆ సమస్యను ఎటువంటి పరిస్థితి ఎదురైనా పరిష్కరిస్తుంది. తన బిడ్డ క్షేమం కోసం పోరాడే సమయంలో తన కంటే గొప్ప యోధురాలు ఈ ప్రపంచంలో లేరంటూ ఓ తల్లి చాటి చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం  పోలాండ్ నివాసి అయిన 50 ఏళ్ల  మాల్గోర్జాటా జ్విర్జిన్స్కా MMA పోరాటంలో భాగంగా రింగ్ లో ఒక యువతితో పోరాడుతోంది. ఉన్న తన యువతి తన కొడుకు మాజీ ప్రియురాలి. ఆమెతో పోరాడిన మాల్గోర్జాటా యువతితో పోరాడి దారుణంగా కొట్టింది. ఆమె తన కోసం కాదు కొడుకు కోసం పోరాడుతోందని చూసిన వారికీ ఎవరికైనా అర్ధం అవుతుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, ఆమె రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. మాల్గోర్జాటా వృత్తిని గోసియా మ్యాజికల్ అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఈ వీడియోను గోసియా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 50 ఏళ్ల మాల్గోర్జాటా..  19 ఏళ్ల నికోలా ఎలోకిన్ మధ్య భీకర పోరు జరుగుతున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. మాల్గోర్జాటా నికోలాపై దాడి చేసిన సాంకేతికత ఇప్పుడు MMA ఫైటింగ్ ప్రపంచంలో ప్రశంసనీయమైనది.  ఇప్పటి వరకూ పోలాండ్‌లో ఇలాంటి పోరాట ఘటనలు ఎన్నో జరిగినా.. 50 ఏళ్ల మహిళ, 19 ఏళ్ల యువతిల మధ్య జరిగిన ఈ పోరు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారడంతో అందరూ లైక్ చేస్తున్నారు.

వీళ్ల ఫైట్ చూస్తుంటే ఇద్దరు ఫైటర్స్ మధ్య ఇంత చాలా ఏజ్ గ్యాప్ ఉన్నట్లు అనిపించక మానదు. అలాగే ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేదని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..