AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Waiter: రండి బాబు రండి..! కోతులు ఆహారం వడ్డించే హోటల్‌.. ఎగబడి వస్తున్న జనాలు..

కోతులంటేనే అల్లరికి కేరాఫ్‌ అడ్రస్‌. ఎందుకంటే.. వానర చేష్టలు ఎప్పుడూ మనల్ని ఇబ్బందులకు గురిచేవిగానే ఉంటాయి. కానీ, ఇక్కడి కోతులు మాత్రం వెరీ స్పెషల్‌ అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ కోతులు వాటి చేష్టలతో ప్రజల్ని కష్టపెట్టడం కాదు.. అవి కష్టపడి అక్కడి ప్రజలకు విందు భోజనాలు అందిస్తున్నాయి. అవును మీరు చదివింది నిజమే.. ఒక రెస్టారెంట్లలో కోతులు వెయిటర్లుగా కష్టపడి పనిచేస్తున్నాయి. అక్కడికి వచ్చిన జనాలకు వారు కోరిన ఫుడ్‌ సప్లై చేస్తున్నాయి. ఇందుకోసం ఆ కోతులు జీతం కూడా తీసుకుంటున్నాయట. ఈ వింతవిషయం ఎక్కడ జరిగిందంటే...

Monkey Waiter: రండి బాబు రండి..! కోతులు ఆహారం వడ్డించే హోటల్‌.. ఎగబడి వస్తున్న జనాలు..
Monkeys Work As Waiters
Jyothi Gadda
|

Updated on: May 13, 2025 | 8:52 PM

Share

జపాన్ కష్టపడి పనిచేసే దేశంగా పేరుగాంచింది. అక్కడి మనుషులే కాదు జంతువులు కూడా చాలా కష్టపడి పనిచేస్తాయి. ఇందుకు ఉదాహరణగా జపాన్‌లోని ఒక రెస్టారెంట్లలో కోతులు వెయిటర్లుగా కష్టపడి పనిచేస్తున్నాయి. జపాన్‌లోని కయాబుకియా రెస్టారెంట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్. పైగా ఇది విచిత్రమైన రెస్టారెంట్ల జాబితాలో చేర్చబడింది. ఎందుకంటే.. ఇక్కడ రెండు కోతులకు వెయిటర్లుగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ కోతులు రెస్టారెంట్లలో వెయిటర్లుగా పనిచేస్తాయి. ఈ కోతులను చూడటానికి చాలా మంది దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. ఇక్కడ కోతులు వడ్డించే ఆహారం తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.

జపాన్‌లో జంతువులను పని చేయించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. అలాంటి వారికి కఠినమైన శిక్ష (విర్డ్ రూల్స్) విధించే నిబంధన కూడా ఉంది. కానీ, జపాన్‌లోని టోక్యోలో ఉన్న కయాబుకియా రెస్టారెంట్ యజమాని కోతులు ఎంత తెలివైనవో నిరూపించాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ యజమానులు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని, ఆపై కోతులను నియమించుకుంటారు. ఇందులో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు, కోతులతో వారంలో రెండు రోజులు మాత్రమే పని చేయించాల్సి ఉంటుంది.

ఈ రెస్టారెంట్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అతిథులను లోపలికి ఆహ్వానించేది కూడా రెండు కోతులే. హోటల్‌కి వచ్చిన అతిథులకు వానరాలు మెనూ కార్డులు తెచ్చిస్తాయి. వారి నుండి ఆర్డర్లు కూడా తీసుకుంటాయి. ఆహారం వడ్డించే పని కూడా కోతులే చేస్తాయి. ఈ రెస్టారెంట్ గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ కోతులు ఆఫీస్ సిబ్బందిలా యూనిఫాంలు ధరిస్తాయి. ఈ పని చేసినందుకు ప్రతిగా వారికి జీతం (మంకీ జీతం) కూడా ఇస్తారు. కోతులకు జీతంగా వాటికి నచ్చిన అరటిపండ్లు ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..