AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓర్నీ కోతి వేషాలు.. భారీ విషసర్పానికే చేమటలు పట్టించిందిగా.. వీడియో చూడండి..

కోతి పాము తోకపట్టుకుని ఎలా ఆడించిందో వీడియోలో కనిపిస్తుంది. ఈ పాము దృశ్యాన్ని ఎవరో తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఓర్నీ కోతి వేషాలు.. భారీ విషసర్పానికే చేమటలు పట్టించిందిగా.. వీడియో చూడండి..
Monkey Snake Fight
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2023 | 7:53 PM

Share

ఈరోజుల్లో వైరల్ వీడియోలంటే చాలా మందికి ఇష్టం. దీంతో సోషల్ మీడియాలో రోజూ వందల కొద్దీ వీడియోలు షేర్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూసిన వెంటనే ప్రజల్లో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. ఇక్కడ ఒక పాము, కోతికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇది ఆశ్చర్యంతో పాటు ఫన్నీగా ఉంది. ఎందుకంటే, ఈ వీడియోలో ఒక కోతి ఒక భారీ విష సర్పాన్ని ముప్పుతిప్పలు పెట్టడం కనిపించింది.

సాధారణంగా పెద్ద జంతువులు పాములకు దూరంగా ఉంటాయి. ఎందుకంటే, పాము ఎవరిపైనైనా ప్రమాదకరంగా దాడి చేస్తుంది. మీరు కూడా ఇలాంటి వీడియోలు చాలా చూసే ఉంటారు. కానీ, ఈ వైరల్ వీడియోలో, ఒక కోతి ఒక పెద్ద పామును ఆటపట్టిస్తోంది. వీడియోలో, ఖాళీ స్థలంలో పాము కూర్చుని ఏదో చేస్తుండటం మీరు చూడవచ్చు. అప్పుడు హఠాత్తుగా ఒక కోతి అక్కడికి ప్రవేశించింది. మొదట కోతి ప్రశాంతంగా పాము పక్కనే నిలబడింది. కానీ, మరుసటి క్షణం పామును ఆటపట్టించటం మొదలుపెట్టింది.. కోతి పాము తోక పట్టుకుని లాగడం ప్రారంభిస్తుంది. ఈ కోతి ప్రవర్తన చూసి పాము కూడా కలవరపడుతుంది. కానీ, కోతి తన చిలిపి చేష్టలను ఆపకుండా అలాటే పాము తోకపట్టుకుని తిప్పుతూ ఉంటుంది. ఒకట్రెండు సార్లు పాము కోతిపై కూడా దాడి చేస్తుంది. చివరికి ఏం జరుగుతుందో తెలియాలంటే ముందుగా ఈ వీడియో చూడాల్సిందే.

కోతి పాము తోకపట్టుకుని ఎలా ఆడించిందో వీడియోలో కనిపిస్తుంది. ఈ పాము దృశ్యాన్ని ఎవరో తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ’10_వైపర్_21′ అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. వేల మంది దీన్ని లైక్ చేశారు. మరోవైపు ఈ వీడియోపై జనాలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..